చీరలో మెరిసిపోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. నెటిజన్లు ఏమన్నారంటే..?

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4 వల్ల అందరి కంటే ఎక్కువగా లబ్ధి పొందిన కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారా అనే ప్రశ్నకు మోనాల్ పేరు సమాధానంగా వినిపిస్తుంది.బిగ్ బాస్ విన్నర్ అభిజిత్, బిగ్ బాస్ రన్నర్ అఖిల్ కంటే మోనాల్ కే ఎక్కువగా అవకాశాలు దక్కుతున్నాయి.

 Monal Gajjar Saree Photo Goes Viral In Social Media, Goes Viral, Monal Gajjar, S-TeluguStop.com

టీవీ షోలు, బుల్లితెర షోలతో పాటు వెబ్ సిరీస్ లలో కూడా ఛాన్స్ దక్కించుకుంటూ మోనాల్ గజ్జర్ వార్తల్లో నిలుస్తున్నారు.

బిగ్ బాస్ షోలో పొట్టి దుస్తుల్లో కనిపించి గ్లామర్ షో చేసిన మోనాల్ చీరలో మెరిసిపోతున్న ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

ఆకుపచ్చని చీరలో మోనాల్ కుందనపు బొమ్మలా కనిపిస్తున్నారు.ఆకుపచ్చని చీరలో మోనాల్ చీరకే అందం తెచ్చేలా ఉన్నారు.తెలుగమ్మాయి కాకపోయినా తెలుగమ్మాయే అనిపించేంత అందంగా మోనాల్ గజ్జర్ ఫోటోలలో కనిపించడం గమనార్హం.

సంక్రాంతి పండుగకు విడుదలైన అల్లుడు అదుర్స్ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసిన మోనాల్ పాటతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

స్టార్ మా ఛానెల్ లో ప్రసారమవుతున్న డ్యాన్సీ ప్లస్ అనే షోకు మోనాల్ జడ్జిగా వ్యవహరిస్తున్నారు.మరోవైపు బిగ్ బాస్ హౌస్ లో అఖిల్ తో సన్నిహితంగా మెలిగిన మోనాల్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తరువాత కూడా అఖిల్ తో కలిసి పార్టీలు చేసుకుంటున్నారు.

Telugu Monal Gajjar-Movie

వయస్సులో మోనాల్ గజ్జర్ కంటే అఖిల్ నాలుగు సంవత్సరాలు చిన్నవాడు అయినప్పటికీ చూడటానికి మాత్రం అఖిల్ ఎక్కువ ఏజ్ ఉన్న అబ్బాయిలానే కనిపిస్తాడు.ఈ ఇద్దరు కలిసి చేస్తున్న వెబ్ సిరీస్ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొనగా ఆ వెబ్ సిరీస్ ఎప్పటినుంచి స్ట్రీమింగ్ అవుతుందో చూడాల్సి ఉంది.మోనాల్ అఖిల్ కాంబినేషన్ లో లో తెరకెక్కే వెబ్ సిరీస్ సక్సెస్ అవుతుందేమో చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube