సోనూసూద్‌ కు మోనాల్‌ అభిమాని ఎమోషనల్‌ లేఖ  

monal gajjar fan open latter for sonu sood for help Monal Gajjar, Sonu Soodh, Big Boss 4, Monal Fan, Akhil And Abhijith, Monal Play Try Angel Love Story - Telugu Akhil And Abhijith, Big Boss 4, Monal Fan, Monal Gajjar, Monal Gajjar Fan Open Latter For Sonu Sood For Help, Monal Play Try Angel Love Story, Sonu Soodh

తెలుగు బిగ్‌బాస్‌ లో ప్రత్యేక ఆకర్షణగా మొదటి నుండి నిలుస్తున్న మోనాల్‌ గజ్జర్‌ ట్రయాంగిల్‌ లవ్‌ స్టోరీని నడిపిస్తుంది అంటూ విమర్శలు వస్తున్నాయి.మొదటి నుండి కూడా ఆమెను కొందరు టార్గెట్‌ చేసి సోషల్‌ మీడియాలో చెడు ప్రచారం చేస్తున్నారు.

TeluguStop.com - Monal Gajjar Fan Open Latter For Sonu Sood For Help

ఒకే సమయంలో అఖిల్‌ మరియు అభిజిత్‌లతో ఆమె చేస్తున్న ప్రేమాయణం ఇంటి సభ్యులకు మాత్రమే కాకుండా ప్రేక్షకులకు కూడా ఆశ్చర్యంను కలిగించింది.అభిజిత్‌ మరియు అఖిల్‌లతో మార్చి మార్చి మాట్లాడుతూ విమర్శలు ఎదుర్కొన్న మోనాల్‌ కు బయట విపరీతమైన నెగిటివిటీ ఉంది.

ఆ విషయం ఆమెకు తెలియక పోవచ్చు.బయటకు వచ్చిన తర్వాత ఆమెకు అసలు విషయం తెలిస్తే ఏం అవుతుందో అంటూ ఆమె అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

TeluguStop.com - సోనూసూద్‌ కు మోనాల్‌ అభిమాని ఎమోషనల్‌ లేఖ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

అందుకే ఆమెకు మద్దతు తెలపాలంటూ ఒక అభిమాని ప్రముఖ నటుడు సోనూసూద్‌ కు విజ్ఞప్తి చేయడం జరిగింది.

ఇది కాస్త విడ్డూరంగా ఉన్నా కూడా సోషల్‌ మీడియాలో ప్రస్తుతం ఈ లేఖ వైరల్‌ అవుతోంది.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం సోనూసూద్‌ కు మోనాల్‌ తో పరిచయం ఉంది.ఆ పరిచయం కారణంగా సోనూసూద్‌ ఆమెను కాపాడాల్సిందే అంటూ అభిమాని ఇద్దరి ఫొటోను షేర్‌ చేసి మరీ విజ్ఞప్తి చేశాడు.

మోనాల్‌ మొదటి నుండి కూడా అందరితో స్నేహంగా ఉండేందుకు ప్రయత్నిస్తుంది.ఆమెకు ఎలాంటి చెడు ఉద్దేశ్యాలు లేకున్నా కూడా కొందరు ఆమెను తప్పుగా చూడటం జరిగింది.దాంతో ఆమెను చాలా మంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారు.ఆమెకు తెలుగు సరిగా మాట్లాడటం రాకపోవడం వల్ల కూడా ఆమె అబద్దాల కోరుగా ముద్రింపబడింది.

మొత్తానికి బిగ్‌బాస్‌ వల్ల ఆమెపై చాలా నెగిటివిటీ పెరిగింది.ఆమె గెలుపు సహకరించకున్నా ఆమెకు సంబంధించిన విషయాలు నిజం కాదని చెప్పాల్సిందిగా అభిమాని సోనూసూద్‌కు విజ్ఞప్తి చేశాడు.

ప్రస్తుతం సోనూసూద్‌ ప్రతి ఒక్కరికి కూడా సాయం చేస్తూ రియల్‌ హీరో అనిపించుకుంటున్నాడు.అందుకే ఇప్పుడు మోనాల్‌కు సాయం చేయాలని ఆమె అభిమాని కోరడం జరిగింది.

మరి సోనూసూద్‌ ఎలా స్పందిస్తాడు అనేది చూడాలి.

#Monal Fan #Sonu Soodh #Big Boss 4 #MonalGajjar #Monal Gajjar

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Monal Gajjar Fan Open Latter For Sonu Sood For Help Related Telugu News,Photos/Pics,Images..