అల్లుడు అదుర్స్‌ లో బిబి బ్యూటీకి ఛాన్స్‌

తెలుగు బిగ్‌ బాస్‌ సీజన్‌ 4 లో ప్రత్యేకమైన కంటెస్టెంట్‌ ఎవరైనా ఉన్నారా అంటే అది ఖచ్చితంగా మోనాల్‌ గజ్జర్‌ అనడంలో సందేహం లేదు.ఆమె ఒక బ్రహ్మ పదార్థం మాదిరిగా ప్రేక్షకులకు తోచింది.

 Monal Gajjar Doing A Item Song In Bellamkonda Sai Srinivas Movie Alludu Adhurs,-TeluguStop.com

ఎన్ని సార్లు నామినేషన్ లోకి వచ్చినా కూడా బిగ్‌ బాస్ ప్రేక్షకులు ఆమెకు ఓట్లు వేయలేదు.అయినా కూడా ఆమె సేవ్‌ అవుతూ వచ్చింది.

ఎన్నో సార్లు మోనాల్ సేవ్‌ అవ్వడం ప్రేక్షకులందరికి కూడా ఆశ్చర్యం వేసింది.మోనాల్‌ సేవ్‌ అవుతూ రావడంతో నిర్వాహకులు ఏదో చేస్తున్నారేమో అని, తెర వెనుక ఏదో జరుగుతుందేమో అంటూ అనుమానాలు వ్యక్తం అయ్యాయి.14 వారాలు కొనసాగిన ఆమె అందరిని ఆశ్చర్య పర్చింది.బయటకు వచ్చిన తర్వాత ఆమె బిజీ బిజీగా గడిపేస్తోంది.

బిగ్‌ బాస్‌ వల్ల ఆమెకు క్రేజ్‌ బాగా పెరిగింది.అందుకే ఆమెకు సినిమాల్లో మరియు బుల్లి తెరపై ఆఫర్లు వస్తున్నాయి.

Telugu Alludu Adhurs, Bellamkonda, Bigg Boss, Monal, Monal Gajjar, Monalgajjar,

బుల్లి తెరపై వరుసగా వస్తున్న ఆఫర్ల కారణంగా ఆమెకు వెండి తెర ఆఫర్లు కూడా తలుపు తడుతున్నాయి.తాజాగా బెల్లం కొండ సాయి శ్రీనివాస్ హీరోగా రూపొందుతున్న అల్లుడు అదుర్స్‌ సినిమాలో ఐటెం సాంగ్‌ చేసే అవకాశం ఈమెకు వచ్చింది.ఈ ఆఫర్ తో తెలుగులో ఈ అమ్మడు రీ ఎంట్రీ ఇవ్వడం జరుగుతుంది.రికార్డు స్థాయిలో ఈ సినిమా కోసం నిర్మాతలు ఖర్చు పెడుతున్నారు.సినిమాలోని ఐటెం సాంగ్‌ ను చాలా ప్రత్యేకంగా ప్లాన్‌ చేయాలని దర్శకుడు చాలా రోజులుగా చర్చలు జరుపుతున్నాడు.తాజాగా బిగ్‌ బాస్ క్రేజ్ తో యమ దూకుడు మీదున్న ఈ అమ్మడు అయితే ఖచ్చితంగా తెలుగులో అందరిని ఆకర్షించే అవకాశం ఉంటుందనే ఉద్దేశ్యంతో అల్లుడు అదుర్స్‌ సినిమా కోసం ఆమెను ఐటెంగా ఎంపిక చేశారనే వార్తలు వస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube