మోనాల్‌ కుళాయి కట్టేసేలా లేదు.. కళ్యాణి రచ్చ ఆపేలా లేదు

బిగ్‌బాస్‌ అంటేనే గొడవలు అనడంలో ఎలాంటి సందేహం లేదు.కంటెస్టెంట్స్‌ ఎంత బాగుండాలని అనుకున్నా కూడా బిగ్‌బాస్‌ కావాలని వారి మద్య గొడవలు పెడుతూ ఉంటాడు.

 Heroine  Monal Gajjar Crying Bigg Boss4, Bigg Boss4, Highlights, Karate Kalyani,-TeluguStop.com

టాస్క్‌ లు లేదా మరేదైనా పని చేయడం వల్ల కంటెస్టెంట్స్‌ మద్య గొడవలు రచ్చ రచ్చ అవుతూ ఉంటాయి.అతి కొన్ని సందర్బాల్లో మాత్రమే వారిలో వారే బిగ్‌బాస్‌ చెప్పకుండానే కొట్టుకునే వరకు వెళ్లారు.

నిన్నటి బిగ్‌బాస్‌ ఎపిసోడ్‌ లో అభిజిత్‌ మరియు కళ్యాణిల మద్య చిన్న గొడవ కాస్త పెద్దది అయ్యింది.కళ్యాణి చిన్న విషయాన్ని కాస్త సీరియస్‌ చేసింది.

అభిజిత్‌ను కళ్యాణి విమర్శించడం జరిగింది.ఆ తర్వాత కళ్యాణికి అభిజిత్‌ సారీ చెప్పడంతో వివాదం సర్థుమనిగినట్లయ్యింది.

ఇక మొదటి ఎపిసోడ్‌లో మాదిరిగానే నిన్నటి ఎపిసోడ్‌లో కూడా మోనాల్‌ గజ్జర్‌ తన కుళాయిని ఓపెన్‌ చేసింది.కారణం లేకుండానే ఈమెకు కనీళ్లు వస్తున్నాయి.చాలా మంది చిరాకుగా ఉందంటూ కామెంట్స్‌ చేస్తుంటే మరికొందరు మాత్రం ఈమె ఎందుకు ఇలా చేస్తుంది అంటూ అసహనంగా ఉన్నారు.పదే పదే ఏడవడం వల్ల విమర్శల పాలవుతున్న మోనాల్‌ గజ్జర్‌ పూర్తిగా వెజిటేరియన్‌ అవ్వడం వల్ల కిచెన్‌ లో ఇబ్బంది పడుతుందట.

నాన్‌ వెజ్‌ వంటలు వండే సమయంలో ఆమె ఆ వాసన భరించలేక పోతున్నట్లుగా ఆవేదన వ్యక్తం చేసింది.మొత్తానికి బిగ్‌బాస్‌లో మోనాల్‌ ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది అనుకుంటే ఆమె ప్రవర్తన చూస్తుంటే త్వరగానే వెళ్లి పోయే అవకాశం ఉందేమో అనిపిస్తుంది.

Telugu Abhijeet, Big Boss, Bigg Boss Tasks, Bigg Boss, Fights, Highlights, Karat

ఇక నిన్నటి ఎపిసోడ్‌ లో ఆసక్తికర సంఘటన ఏదైనా ఉందా అంటే అది ఖచ్చితంగా గ్లోరి సోహెల్‌ లకు ఫుడ్‌ లేకుండా ఇంటి సభ్యులు ఫోన్‌ కట్‌ చేయడం.సాయంత్రం వరకు వారికి ఫుడ్‌ లేకపోవడంతో వారు తీవ్ర అసహనంతో ఉన్నారు.దాంతో వారిని ఇంట్లోకి పంపించిన బిగ్‌బాస్‌ తేల్చుకోండి అంటూ కామెంట్స్‌ చేశారు.దాంతో ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చిన కొన్ని నిమిషాలకే వారు గొడవ పెట్టుకోవడం మొదలు పెట్టారు.

నేటి ఎపిసోడ్‌ లో అభిజిత్‌ మరియు సోహెల్‌ ల మద్య గొడవ తారా స్థాయికి చేరబోతున్నట్లుగా అనిపిస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube