అఖిల్‌ క్యారెక్టర్ బ్యాడ్‌ చేసేలా మాట్లాడిన మోనాల్‌.. ఈ వారం ఖేల్‌ ఖతం

తెలుగు బిగ్‌ బాస్‌ మొదటి వారం నుండి మొన్నటి వరకు అఖిల్‌ మరియు మోనాల్‌ల మద్య మంచి రిలేషన్‌ కొనసాగింది.ఇద్దరి మద్య ప్రేమ వ్యవహారం సాగుతుందని కూడా ప్రచారం జరిగింది.

 Monal Gajjar Comments On Akhil Character, Monal Gajjar, Akhil, Bigg Boss, Amma R-TeluguStop.com

అఖిల్‌ మరియు మోనాల్‌ల మద్య ఉన్న వ్యవహారం కారణంగా షోకు ఒకానొక సమయంలో రేటింగ్‌ వచ్చింది.కాని ఇప్పుడు ఆ రేటింగ్‌ కూడా తగ్గిపోయింది.

ఇలాంటి సమయంలో ఇద్దరి మద్య గొడవలు పెట్టాలనే ఉద్దేశ్యంతో ఆమె చెప్పిన మాటలను అఖిల్‌కు చూపించారు.దాంతో ఇద్దరి మద్య గ్యాప్‌ వచ్చింది.

అది ఎంతగా అంటే ఈ వారం ఏకంగా అఖిల్‌ ఆమెను నామినేట్‌ చేయడం వరకు వచ్చింది.ఈ వారంలో ఆమె తలపై కోడి గుడ్డు పగులకొట్టడం వల్ల ఆమెను నామినేట్‌ చేసిన అఖిల్‌ ఆమెతో పూర్తిగా తెగ తెంపులు చేసుకున్నట్లే అంటూ క్లారిటీ ఇచ్చేశాడు.

అఖిల్‌ నామినేట్‌ చేయడంతో షాకయ్యిన మోనాల్‌ పక్కనే ఉన్న అమ్మ రాజశేఖర్‌ వద్దకు వెళ్లి కన్నీరు పెట్టుకుంది.

ఆ సమయంలో అమ్మ రాజశేఖర్‌తో మోనాల్‌ మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు మరింతగా వారి మద్య దూరం పెంచాయి.

స్నేహితురాలివి అయిన నిన్ను ఎలా నామినేట్‌ చేస్తాడు అంటూ అమ్మ రాజశేఖర్‌ అన్నప్పుడు అమ్మాయి అబ్బాయి మద్య స్నేహం అంటే అది కేవలం ఫ్రెండ్‌షిప్‌ మాత్రమే కాదు.కొంచెం మోర్‌ కావాలి.

ఆ కొంచెం మోర్‌ లేదు కదా అందుకే ఇలా చేసి ఉంటాడు అంటూ అఖిల్‌ ను బ్యాడ్‌ చేసేలా మాట్లాడింది.అఖిల్‌ తన నుండి ఏదో ఆశించాడు.

అది తాను ఇవ్వక పోవడం వల్ల ఇలా చేశాడు అంటూ మోనాల్‌ చేసిన వ్యాఖ్యలతో అఖిల్‌ అభిమానులు తీవ్రంగా హర్ట్‌ అయ్యారు.ఈవారం ఎట్టి పరిస్థితుల్లో మోనాల్‌ ను ఎలిమినేట్ చేయాల్సిందే అంటూ బలంగా నిర్ణయించుకున్నారు.

అమ్మ రాజశేఖర్‌ కంటే మొదటగా మోనాల్‌ ను ఎలిమినేట్‌ చేయాలని వారంతా భావిస్తున్నారు.కనుక ఈసారి మోనాల్‌ ఖేల్‌ ఖతం అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube