అఖిల్ కు మోనాల్ ఝలక్.. మనస్సులో ఉన్న A ఎవరంటే..?  

అఖిల్ కు మోనాల్ ఝలక్.. మనస్సులో ఉన్న A ఎవరంటే..? - Telugu Akhil And Monal, Aryan, Bigg Boss Season 4, Dracula Movie, Ex Boy Friend, In An Interview, Monal Gajjar

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ షో సీజన్ 4 ద్వారా హీరోయిన్ మోనాల్ గజ్జర్ ప్రేక్షకుల్లో బాగానే గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే.మొదట్లో అభిజిత్ తో సన్నిహితంగా ఉన్న మోనాల్ ఆ తరువాత అఖిల్ తో సన్నిహితంగా మెలిగింది.

TeluguStop.com - అఖిల్ కు మోనాల్ ఝలక్.. మనస్సులో ఉన్న A ఎవరంటే..?

అయితే బిగ్ బాస్ హౌస్ లో ఉన్న సమయంలో తన మనసులో ఉన్నది A అని చెప్పారు.మోనాల్ A అని చెప్పడంతో ఆందరూ అఖిల్ లేదా అభిజిత్ గురించి మోనాల్ చెప్పి ఉండవచ్చని భావించారు.

అయితే తన మనస్సులో ఉన్న A ఎవరో మోనాల్ చివరకు చెప్పేసింది.మోనాల్ మనస్సులో ఉన్న A ఎవరో కాదు ఆర్యన్.తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మోనాల్ తన బాయ్ ఫ్రెండ్ కు సంబంధించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.తాను ఆర్యన్ అనే వ్యక్తితో నాలుగు సంవత్సరాల పాటు ప్రేమలో ఉన్నానని.

TeluguStop.com - అఖిల్ కు మోనాల్ ఝలక్.. మనస్సులో ఉన్న A ఎవరంటే..-General-Telugu-Telugu Tollywood Photo Image

ఇద్దరి మధ్య గొడవలు రావడం వల్ల 2016 సంవత్సరంలో బ్రేకప్ జరిగిందని ఆమె అన్నారు.

బ్రేకప్ తరువాత తాను గుజరాత్ కు వెళ్లి గుజరాతీ సినిమాలు చేసుకున్నానని ఆమె తెలిపారు.తాను సౌత్ అమ్మాయిలా కనిపిస్తానని అందువల్ల గుజరాతీ సినిమాల్లో ఆఫర్ల విషయంలో ఇబ్బందులు ఎదురయ్యాయని మోనాల్ పేర్కొన్నారు.మోనాల్, ఆర్యన్ 2012 సంవత్సరంలో డ్రాకులా అనే సినిమాలో కలిసి నటించారు.

ఆ సినిమా సమయంలోనే మోనాల్ కు ఆర్యన్ కు పరిచయం ఏర్పడిందని తెలుస్తోంది.

మోనాల్ మనస్సులో ఉన్న A ఎవరో తెలియడంతో అఖిల్ కు మోనాల్ ఝల్క్ ఇచ్చిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

అఖిల్ తో మోనాల్ ప్రేమలో ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నా వాళ్లిద్దరి మధ్య ఏం లేదని తెలుస్తోంది.మోనాల్ క్లారిటీ ఇవ్వడంతో ఆమె మనస్సులో ఉన్న A ఎవరనే సస్పెన్స్ రివీల్ అయినట్లేనని చెప్పాలి.

#Aryan #In An Interview #Ex Boy Friend #Monal Gajjar #Akhil And Monal

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు