హైదరాబాద్ లో సొంతఇల్లు కొన్న మోనాల్ గజ్జర్

టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి సుడిగాడు సినిమాలో నటించిన గుజరాతి భామ మోనాల్ గజ్జర్.ఈ బ్యూటీ ఆరంభంలో ఓ మూడు, నాలుగు సినిమాలు చేసి ఉన్నపళంగా తెలుగు సినిమాలకి ఫుల్ స్టాప్ పెట్టి గుజరాత్ వెళ్ళిపోయి మాతృభాషలో సినిమాలు చేసుకుంది.

 Monal Gajjar Buys A House In Hyderabad, Tollywood, Telugu Heroine, Bigg Boss Sea-TeluguStop.com

అయితే ఈ బ్యూటీని బిగ్ బాస్ నిర్వాహకులు వెతికి మరీ తీసుకొచ్చారు.బిగ్ బాస్ సీజన్ 4లో ఈమె పార్టిసిపేట్ చేయడంతో చివరి వరకు ఉంది.

ఈ బిగ్ బాస్ షోతో ఒక్కసారిగా మోనాల్ గజ్జర్ లైమ్ లైట్ లోకి వచ్చింది.అక్కడ మరో పార్టిసిపెంట్ అఖిల్ సార్ధక్ తో ఆన్ స్క్రీన్ రొమాన్స్ కాస్తా మోనాల్ గజ్జర్ పాపులర్ కి కారణం అయ్యింది.

ఇక బయటకి వచ్చాక కూడా వీరిద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తుందనే టాక్ వినిపిస్తుంది.అయితే దీనికి వీరు ఫుల్ స్టాప్ పెట్టె ప్రయత్నం చేయలేదు.

తామిద్దరం మంచి ఫ్రెండ్స్ అని మాత్రం చెప్పి తప్పించుకుంటున్నారు.

Telugu Hyderabad, Monal Gajjar, Telugu, Tollywood-Movie

అయితే అప్పుడప్పుడు వీరిద్దరు క్లోజ్ గా ఉన్న ఫోటోలని సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంటు అందరికి అనుమానాలు పెంచేస్తున్నారు.ఇదిలా ఉంటే బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చాక మోనాల్ కి ఆఫర్స్ భాగానే పెరిగాయి.డాన్స్ రియాలిటీ షోకి జడ్జ్ గా మారింది.

అలాగే త్వరలో ఒక రియాలిటీకి వాఖ్యతగా ఈమె మారబోతుందని టాక్ వినిపిస్తుంది.అదే సమయంలో సినిమా అవకాశాలు కూడా తెచ్చుకుంటుంది.

అఖిల్ సార్ధక్ తో కలిసి ఒక వెబ్ సిరీస్ లో నటిస్తుంది.ఇదిలా ఉంటే తాజాగా ఈ బ్యూటీ హైదరాబాద్ లో సొంత ఇల్లు కొనుగోలు చేసింది.

అలాగే ఆ ఫ్లాట్ లోకి గృహప్రవేశం కూడా చేసేసింది.ఈ విషయాన్ని ఆమె ద్రువీకరించింది.

హైదరాబాద్ లో తనకి సొంత ఇల్లు ఉందని, ఇకపై తాను హైదరాబాదీ అమ్మాయిని అంటూ చెప్పుకొచ్చింది.దీనిని బట్టి ఈ అమ్మడు తెలుగుపైనే ఫుల్ ఫోకస్ పెట్టిందని అర్ధమవుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube