వామ్మో.. మోనాల్ కు బిగ్ బాస్ అంత ఇస్తున్నాడా..?

స్టార్ మా ఛానెల్ లో ప్రసారమయ్యే బిగ్ బాస్ షో గురించి ప్రేక్షకుల్లో, సెలబ్రిటీల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉంటాయి.ఈ షో ద్వారా ప్రేక్షకుల్లో క్రేజ్ తెచ్చుకున్న సెలబ్రిటీలు ఎంతమంది ఉన్నారో విమర్శల పాలైన సెలబ్రిటీలు కూడా అంతే మంది ఉన్నారు.

 Monal Gajjar Beats Abhijeet Abhil In Terms Of Weekly Payments In Bigg Boss Telug-TeluguStop.com

బిగ్ బాస్ 3లో పాల్గొన్న కంటెస్టెంట్, వరుణ్ సందేశ భార్య వితిక ఈ షో నుంచి బయటకు వచ్చాక సోషల్ మీడియాలో ట్రోల్స్ వల్ల డిప్రెషన్ కు గురయ్యానని చెప్పిందంటే ఈ షో సెలబ్రిటీలు నచ్చకపోతే ఏ స్థాయిలో వ్యతిరేకత పెంచుతుందో అర్థమవుతుంది.

అయితే అన్నీ తెలిసినా సినిమా సెలబ్రిటీలు, టీవీ సెలబ్రిటీలు, యూట్యూబ్ స్టార్లు, యాంకర్లు ఈ షోపై ఆసక్తి చూపడానికి ప్రధాన కారణం రెమ్యూనరేషన్.

బిగ్ బాస్ నిర్వాహకులు తమ ఆదాయం కంటే ఎక్కువ మొత్తం ఇస్తారు కాబట్టే ఈ షోలో పాల్గొనటానికి చాలామంది ఆసక్తి చూపుతారు.ఇప్పటికే మూడు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న బిగ్ బాస్ షో నిన్నటితో ఆరో వారంలోకి అడుగుపెట్టింది.

Telugu Abhijith, Anchors, Monal Gajjar, Monal Big Boss, Nagarjuna, Maa, Tv, Yout

మరి సీజన్ 4లో ఎక్కువ పారితోషికం అందుకుంటున్నది ఎవరు.? అనే ప్రశ్నకు సమాధానంగా మోనాల్ పేరు వినిపిస్తోంది. తెలుగులో సుడిగాడు సినిమా మాత్రమే మోనాల్ కెరీర్ లో హిట్టు సినిమా.అయితే గ్లామర్ ఉన్న హీరోయిన్ కావడం, మోనాల్ కు ప్రేక్షకుల్లో అంతోఇంతో ఫాలోయింగ్ ఉండటంతో బిగ్ బాస్ మోనాల్ కు వారానికి 8 లక్షల రూపాయలు ఇస్తున్నాడని తెలుస్తోంది.

బిగ్ బాస్ హౌస్ లో ఇతర కంటెస్టెంట్లు తీసుకునే దానితో పోలిస్తే మోనాల్ కే ఎక్కువ పారితోషికం దక్కుతోందని టాక్.అఖిల్, అభిజత్ లతో ప్రేమాయణం నడిపి పాపులర్ అవుతున్న మోనాల్ బిగ్ బాస్ సీజన్ 4 లో మెయిన్ అట్రాక్షన్ గా నిలుస్తోంది.

మోనాల్ తరువాత లాస్య, నోయల్ కు వారానికి 7 లక్షల రూపాయల చొప్పున చెల్లిస్తున్నారని సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube