అఖిల్-మోనాల్ మళ్లీ అదే పని.. వెక్కి వెక్కి ఏడ్చిన‌ సోహైల్?

టాలీవుడ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 4.ఐదు వారాలు పూర్తి చేసుకుని ఆరో వారానికి చేరుకున్న సంగ‌తి తెలిసిందే.

 Monal Gajjar And Akhil Highlight Seen In Bigg Boss 4! Monal Gajjar, Akhil, Bigg-TeluguStop.com

కొత్త కొత్త టాస్కులు, గొడ‌వ‌లు, ఏడ్పులతో బిగ్ బాస్ హౌస్‌ను ఇంటి స‌భ్యులు ర‌స‌వ‌త్త‌రంగా మార్చేస్తున్నారు.ఇక మ‌రోవైపు గుజరాతీ బ్యూటీ మోనాల్ గజ్జర్ వ్య‌వ‌హారం మ‌రో స్థాయిలో ఉంది.

బిగ్ బాస్ హౌస్‌లో ఈమె న‌డిపే ట్రాకులు ఇంటి స‌భ్యుల‌కే కాదు.బిగ్ బాస్ చూసే వీక్ష‌కుల‌కు సైతం పిచ్చెక్కిపోతోంది.

ఓవైపు అఖిల్‌.మ‌రోవైపు అభిజిత్ ఇద్దరితోనూ ట్రాక్ నడిపిస్తూ హాట్ టాపిక్‌గా మారుతోంది.ఈ క్ర‌మంలోనే మోనాల్ విషయంలో అఖిల్, అభిజిత్‌లు కొట్టుకునే స్థాయికి వచ్చేయడం గ‌మ‌నార్హం.దీనిపై ఇంటి స‌భ్యులు కూడా అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారు.

అయిన‌ప్ప‌టికీ మోనాల్ ఏ మాత్రం మార‌డం లేదు.అయితే ఈ వారం అభిజిత్‌కు జ్ఞానోద‌యం అయిందో.

ఏమో తెలియ‌దు కానీ, మోనాల్‌కు దూరంగా ఉండ‌డం మొద‌లు పెట్టారు.

ఆమెతో మాట్లాడం కూడా త‌గ్గించేశాడు.

దీంతో మోనాల్ ఎక్కువ స‌మ‌యం అఖిల్‌తోనే గ‌డుపుతోంది.ఇక నిన్న‌టి ఎపిసోడ్‌లో కూడా ఎప్ప‌టిలాగానే అఖిల్-మోనాల్ ముచ్చుట్లు పెట్టి.

హౌస్‌లో ఉన్నామ‌న్న విష‌యాన్నే మ‌ర్చిపోయి ప్ర‌వ‌ర్తించారు.ఈ క్ర‌మంలోనే మోనాల్ ఏం చేస్తుందో అదే చేశాడు అఖిల్‌.

దీంతో తెలివిగా మోనాల్ నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలే అంటూ పాట పాడింది.ఇక‌ అఖిల్ కూడా నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలని పాడటంతో తెగ సిగ్గుపడిపోయింది మోనాల్‌.

ఆ త‌ర్వాత అఖిల్ `మొన్న క‌నిపించావు, మైమ‌రిచిపోయాను.` అనే పాట అందుకోగా.మోనాల్ థాంక్యూ చెప్పి తెగ ఆనంద‌ప‌డిపోతుంది.మొత్తానికి వీరి ట్రాక్ ఓ రేంజ్‌లో హైలైట్ అయింది.

ఇక మ‌రోవైపు సొహైల్ సహనాన్ని పరీక్షిస్తూ ఇంటి స‌భ్యులు రెచ్చిపోయి ప్ర‌వ‌ర్తిస్తున్నారు.నిన్న‌టి ఎపిసోడ్‌లో టాస్క్ విష‌యంలో అవినాష్ ఓ రేంజ్‌లో సోహైల్‌పై ఫైర్ అవుతారు.

కానీ, అర‌వ‌న‌ని నాగ్‌కు ఇచ్చిన మాట కార‌ణంగా.సోహైల్ త‌న కోపాన్ని అనుచుకుని వెక్కి వెక్కి ఏడ్చేస్తాడు.

దీంతో మెహబూబ్, అఖిల్‌లు ఓదార్చి.అన్నం పెట్టారు.

ఈ సీన్ ప్రేక్ష‌కుల‌ను సైతం ఎమోష‌న్ ట‌చ్‌లోకి తీసుకువెళ్లింద‌ని చెప్పాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube