అభిజిత్‌ మాటలకు బాగా హర్ట్‌ అయిన మోనాల్‌  

బిగ్‌ బాస్‌ ఈ సీజన్‌ లో మోనాల్‌ తో మొదట అభిజిత్‌ పులిహోర కలుపగా ఆ తర్వాత అఖిల్‌ ఏకంగా చాలా వ్యవహారం నడిపించాడు.ఆమె కోసం త్యాగాలు చేయడం.

TeluguStop.com - Monal Gajjar Again Emotional For Abhijith

ఆమె కోసం మాట్లాడటం, ఆమెను వెనకేసుకు రావడం వంటివి చేశాడు.అఖిల్‌ మరియు అభిజిత్‌లు ఇద్దరు కూడా మోనాల్‌ వల్ల చాలా సార్లు గొడవ పడ్డారనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

అభిజిత్‌ ఈమద్య కాలంలో పూర్తిగా మోనాల్‌కు దూరంగా ఉంటున్నాడు.అయితే ఏ విషయాన్ని అయిన మొహం మీద చెప్పేసే అలవాటు ఉన్న అభిజిత్‌ పలు సందర్బాల్లో మోనాల్‌ బాధ పడేలా మాట్లాడాడు.

TeluguStop.com - అభిజిత్‌ మాటలకు బాగా హర్ట్‌ అయిన మోనాల్‌-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఆ విషయం అందకికి తెలుసు.మోనాల్‌ తాజాగా ఆ విషయాన్ని హారిక వద్ద చెబుతూ కన్నీరు పెట్టుకుంది.

దెయ్యం టాస్క్‌లో భాగంగా అభిజిత్‌ మరియు అఖిల్‌ల మద్య టాస్క్‌ పెట్టి ఇద్దరిలో గెలిచిన వారికి మోనాల్‌ తో డేటింగ్‌ కు వెళ్లే అవకాశంను బిగ్‌ బాస్‌ కల్పించాడు.అయితే అందుకు అభిజిత్‌ ఒప్పుకోలేదు.అసలు మోనాల్‌ తో నాకు సంబంధం వద్దు అంటూ డైరెక్ట్‌గా అనేశాడు.ఆమెతో మళ్లీ మళ్లీ ఎందుకు నా పేరును కలుపుతున్నారు అంటూ మోనాల్‌ అక్కడ ఉండగానే అభిజిత్‌ అనేశాడు.

ఆ మాటలు ఆమెకు బాధను కలిగించాయి.అంతకు ముందు కూడా అభిజిత్‌ నీతో నేను మాట్లాడను.

నీకు నాకు సెట్‌ అవ్వదు అంటూ మొహానే అన్నాడు.అభిజిత్‌ నేను తప్పు చేయను అంటూ తనకు తాను అనుకుంటాడు.

కాని నా విషయంలో చాలా సార్లు తప్పు చేశాడు అంటూ అభిజిత్‌ పై మోనాల్‌ కామెంట్స్‌ చేసింది.ఒక అమ్మాయి ముందు అది మొహంపై నీతో మాట్లాడటం నాకు ఇష్టం లేదు అంటూ చెప్తారా.

అలా చెప్పడం వల్ల ఆ అమ్మాయి ఎంతగా బాధపడుతుందో అతడికి తెలుసా అంటూ మోనాల్‌ ఎమోషనల్‌ అయ్యింది.మరి ఈ విషయాలను హారిక వెళ్లి అభిజిత్‌ తో చెబుతుందో లేదో చూడాలి.

#Abhijith #Monal #Akhil Bb4

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు