అభిజిత్‌ పై మళ్లీ నోరు పారేసుకున్న మోనాల్‌.. విన్నర్‌ అవ్వడం తట్టుకోలేకుందా?

తెలుగు బిగ్ బాస్ సీజన్‌ 4 కు ఒక చెడ్డ పేరు వచ్చింది.అదేంటీ అంటే మోనాల్‌ కోసం ఎంతో మంది బలమైన కంటెస్టెంట్స్ ను ఎలిమినేట్‌ చేశారు.

 Monal Gajjar Again Comments On Bb4 Winner Abijeet, Bigg Boss4 Winner Abijeet, Mo-TeluguStop.com

మోనాల్‌ కంటే పదుల రెట్ల బలమైన కంటెస్టెంట్ ను బయటకు పంపించారు అంటూ విమర్శలు వచ్చాయి.మోనాల్‌ ను బిగ్‌ బాస్‌ నిర్వాహకులు ఓట్లు పడకున్నా సేవ్‌ చేస్తూ వస్తున్నారు అంటూ పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.

బయటకు వచ్చిన తర్వాత కూడా ఆమెపై ఉన్న నెగిటివిటీ మరింత పెరిగింది.కారణం ఆమె అభిజిత్‌ కు వ్యతిరేకంగా మాట్లాడటం.

ఆయన రియల్‌ గేమర్‌ కాదు అంటూ నోటికి వచ్చినట్లుగా మాట్లాడింది.సోషల్‌ మీడియాలో ఆయనకు ఉన్న ఫాలోయింగ్‌ కేవలం పీఆర్ టీం చేసిన మ్యాజిక్‌ అంటూ మోనాల్‌ నోరు పారేసుకుంది.

ఫినాలే జరిగిన ఆదివారం కూడా టీవీ9 తో మాట్లాడుతూ తన దృష్టిలో రియల్‌ విన్నర్‌ అఖిల్‌ అంటూ పేర్కొంది.అభిజిత్‌ గెలిస్తే మీ అభిప్రాయం ఏంటీ అంటూ ప్రశ్నించగా మోనాల్‌ స్పందిస్తూ… బయట అభి టీం బాగా కష్టపడ్డారు.

కనుక ఆయన గెలిచినా సంతోషం అంటూ నోరు పారేసుకుంది.

Telugu Abhijith, Akhil Monal, Bb, Monal Abhijith, Monal Gajjar, Telugu-Latest Ne

అభిజిత్ విన్నర్‌ అంటూ క్లీయర్‌ గా ముందే క్లారిటీ వచ్చినా కూడా అఖిల్‌ గెలవాలని.అఖిల్‌ నెం.1 అంటూ కామెంట్స్ చేసింది.అభిజిత్‌ తో ఆమెకు లోపల చాలా పెద్ద గొడవే జరిగిందని చాలా మంది అనుకుంటున్నారు.అది ఏంటీ అనేది మాత్రం తెలియలేదు.ఆ గొడవ కారణంగానే వచ్చేంత వరకు కూడా అభిజిత్‌ తో మోనాల్‌ సరిగా లేదు.ఒక వేళ మోనాల్‌ వెళ్లినా కూడా అభిజిత్‌ అంతగా ఆసక్తి చూపించలేదు.

మోనాల్‌ వల్ల ఇంఇంట్లో పలువురు స్ట్రాంగ్‌ కంటెస్టెంట్స్ ఎలిమినేట్‌ అవ్వడం జరిగింది.అందువల్ల ఆమె పై నెటిజన్స్‌ సాదారణంగానే కామెంట్స్ చేస్తూ ట్రోల్స్ చేస్తున్నారు.

ఇలాంటి సమయంలో ఆమె అభిజిత్‌ ను ట్రోల్‌ చేయడం పీఆర్‌ టీం వల్లే గెలిచాడు అంటూ గేలి చేసే ప్రయత్నం చేయడంతో మోనాల్ పై మళ్లీ అభిజిత్‌ ఫ్యాన్స్ తీవ్రంగా మండి పడుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube