అభిజిత్‌ను లైక్ చేస్తున్న‌ట్టు చెప్పేసిన మోనాల్‌.. మండిప‌డ్డ‌ అఖిల్‌!

వ‌ర‌ల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 4.ఇటీవ‌ల గ్రాండ్‌గా ప్రారంభ‌మైన విష‌యం తెలిసిందే.

 Monal Gajjar Abhijith Akhil Love Track In Bigg Boss 4! Monal Gajjar, Abhijith, A-TeluguStop.com

ప్ర‌స్తుతం బిగ్ బాస్ ఇంటి స‌భ్య‌లు మూడో వారంలోకి ఎంట్రీ ఇచ్చి.ఆట‌ను రంజుగా మార్చేశారు.

మ‌రోవైపు వారానికి వైర‌ల్డ్ కార్డు ఎంట్రీ అన్న చందంగా.మొద‌టి వారం క‌మెడియ‌న్ కుమార్ సాయి, రెండు వారం జ‌బ‌ర్ద‌స్త్ అవినాష్ ఇంట్లోకి వ‌చ్చారు.

ఇక మూడో వారం నిన్న జ‌రిగిన ఎపిసోడ్‌లో న‌టి స్వాతి దీక్షిత్ బిగ్ బాస్ హౌస్‌లోకి దిగి ర‌చ్చ ర‌చ్చ చేసింది.
ఇదిలా ఉంటే.

`ఉక్కు హృదయం’ టాస్క్ వ‌ల్ల‌ గ‌త రెండు, మూడు రోజులుగా అభిజిత్‌, మోనాల్‌ మధ్య డిస్టెన్స్ పెరిగింది.టాస్క్ పూర్తి అయిన త‌ర్వాత అభిజిత్‌తో మాట్లాడేందుకు కూడా మోనాల్ ఇష్ట‌ప‌డ‌లేదు.

ఇదే స‌మ‌యంలో హారిక‌కు నోయ‌ల్ ద‌గ్గ‌ర అయ్యాడు.దీంతో వీరి ల‌వ్ ట్రాక్ తెర‌పైకి వ‌చ్చింది.

అయితే నిన్న జ‌రిగిన ఎపిసోడ్‌లో మ‌రో ఆస‌క్తిక‌ర ప‌రిణామం చోటుచేసుకుంది.

నిన్న‌టి ఎపిసోడ్ ఇంటి స‌భ్యులంద‌రూ డ్యాన్స్ చేస్తుండ‌గా.

అభిజిత్‌, మోనాల్‌ని ఎవరూ తిరగని చోటుకు తీసుకెళ్లి ముచ్చ‌ట్లు పెట్టాడు.ఈ క్ర‌మంలోనే మోనాల్.

నిన్ను లైక్ చేస్తున్న‌ట్టు అభిజిత్‌కు చెప్పేసింది.దీంతో ఫుల్ ఎగ్జైట్ అయిపోయిన అభిజిత్‌.

నాకు చెప్పవే అవన్నీ అంటూ తెగ పొంగిపోయాడు.అయితే అభిజిత్‌కు మోనాల్ ద‌గ్గ‌ర‌వ‌డంతో.

అఖిల్ తెగ ఫీల్ అయిపోయారు.

ఇది గ‌మ‌నించిన మోనాల్‌.

అఖిల్ వ‌ద్ద‌కు వ‌చ్చి ముచ్చ‌ట్లు పెట్టింది.ఈ క్ర‌మంలోనే నేనేం పెళ్లి చేసుకోవడానికి రాలేద‌ని అఖిల్ మండిప‌డ‌టంతో.

మోనాల్ అత‌డికి సారి చెప్పి.కూల్ చేయ‌డానికి ప్ర‌య‌త్నించింది.

అంతేకాకుండా, అఖిల్‌కు గోరుముద్ద‌లు కూడా తి‌నిపించింది మోనాల్‌.ఏదేమైనా అభిజిత్ కావాలో.

అఖిల్ కావాలో తేల్చుకోలేకపోతున్న మోనాల్.ఇద్ద‌రినీ వీడ‌లేక స‌త‌మ‌త‌మ‌వుతుంద‌ని స్ప‌ష్టంగా అర్థం అవుతోంది.

మ‌రోవైపు అభిజిత్ కుదిరితే మోనాల్‌.కుద‌ర‌క పోతే హారిక అన్న‌ట్టు ప్ర‌వ‌ర్తిస్తున్నాడు.

మ‌రి వీరి ట్రైయాంగిల్ ల‌వ్ ట్రాక్ ఎక్క‌డి వ‌ర‌కు వెళ్తుందో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube