వాటేసుకుని మ‌రీ అఖిల్‌ని నిలదీసిన మోనాల్.. ఏంది సామీ ఇదీ?

తెలుగు అతి పెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ నాల్గువ సీజ‌న్‌.రోజుకో మ‌లుపు తిరుగుతూ ర‌స‌వ‌త్త‌రంగా సాగుతోంది.

 Monal And Akhil Romance In Bigg Boss! Monal, Akhil, Bigg Boss 4, Bigg Boss Telug-TeluguStop.com

ఈ సీజ‌న్‌లో ల‌వ్ ట్రాక్‌లు ఇంటి సభ్యుల‌తో పాటు బిగ్ బాస్ షో చూసే ప్రేక్ష‌కుల‌కు సైతం పిచ్చెక్కిస్తున్నారు.ముఖ్యంగా మోనాల్ బిగ్ బాస్ హౌస్‌లో న‌డిపించే క‌థ వేరే రేంజ్‌లో ఉంటుంద‌ని చెప్పాలి.

ఈమె ఎప్పుడు అభిజిత్‌తో ఉంటుందో.ఎప్పుడు అఖిల్‌తో ఉంటుందో.

ఎవ‌రికీ అర్థం కావ‌డం లేదు.ఇక మొన్న‌టికి మొన్న నామినేష‌న్స్‌లో ఏడ్చుకుంటూ అఖిల్‌, అభిజిత్‌ల‌కు వీర లెవ‌ల్లో వార్నింగ్ ఇచ్చింది.

ఈ క్ర‌మంలోనే మోనాల్ అభిజిత్‌కు దూరంగా ఉంటుంటే.అఖిల్ మోనాల్‌కు దూరంగా ఉంటూ వ‌స్తున్నాడు.కానీ, మోనాల్ మాత్రం అఖిల్‌ను వ‌దిలిపెట్ట‌డం లేదు.ప్ర‌స్తుతం బిగ్ బాస్ హౌస్‌లో బీబీ హోటల్ అనే టాస్క్ జరుగుతుంది.

అయితే టాస్క్ జ‌రుగుతున్న విష‌యం కూడా మ‌ర‌చిపోయి.మోనాల్ ప్ర‌వ‌ర్తించింది.

నిన్న‌టి ఎపిసోడ్‌లో టాస్క్లో భాగంగా.హోట‌ల్ స్టాఫ్ అతిథిల వ‌ద్ద నుంచి డ‌బ్బులు, స్టార్లు సంపాదించుకునే ప‌నిలో ప‌డ్డారు.

అయితే మోనాల్ మాత్రం రిసెప్షన్‌లో ఉండి ఫోన్ మాట్లాడుతూ.ఎందుకు మాట్లాడటం లేదని అక్క‌డే కూర్చుని భోజ‌నం చేస్తున్న‌ అఖిల్‌ని ప్రశ్నించింది.అయినప్పటికీ అఖిల్‌ స్పందించకపోవడంతో.పరుగు పరుగు వచ్చి అఖిల్‌ని వెనక నుంచి వాటేసుకుని ముద్దులుపెట్టేసింది.

అనంత‌రం త‌న‌తో ఎందుకు మాట్లాడ‌డం లేదో నిల‌దీసింది మోనాల్‌.

అందుకు అఖిల్.

తాను ఎవరితో మాట్లాడతలేనని అఖిల్‌ చెప్పాడు.మొత్తానికి బిబి హోట‌ల్ టాస్క్‌ను ప‌క్క‌న పెట్టేసి.

అఖిల్‌తో కాసేపు మోనాల్ ప్రేమ ముచ్చ‌ట్లు పెట్టేసింది.అయితే మొన్న నామినేష‌న్స్‌లో అంత ఓవ‌ర్ యాక్ష‌న్ చేసిన మోనాల్‌.

నేడు వాటేసుకుని మ‌రీ ముచ్చ‌ట్లు పెట్ట‌డంతో ప్రేక్ష‌కులు ఏంది సామీ ఇదీ అంటూ త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు.ఏమ‌న్నా అంటే.

ఫ్రెండ్ షిఫ్ అంటూ మోనాల్ క‌వ‌ర్ చేయ‌డం కామెడీగా ఉంద‌ని అంటున్నారు ప్రేక్ష‌కులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube