మరీ ఇంత దారుణమా...తల్లి గర్భం నుంచే బిడ్డను దొంగిలించారు  

Mom Plotted To Kill Pregnant Woman, Steal Baby-

పసి బిడ్డలు మాయమైన ఘటనలు చాలానే విని ఉంటాం.పురిటిలో ఉన్న పసి కూనను ఎత్తుకుపోయారు, లేదంటే పుట్టి రెండు నెలల బిడ్డను ఎత్తుకుపోయారు ఇలా చెప్పుకుంటే పొతే చాలా ఇలాంటి ఘటనలు వింటున్నాం.ఈ తాజాగా ఘటన గురించి తెలుసుకుంటే మాత్రం ఇంతటి ఘోరాలకి కూడా పాల్పడతారా అన్న ప్రశ్న మన మదిలో మెదులుతుంది...

Mom Plotted To Kill Pregnant Woman, Steal Baby--Mom Plotted To Kill Pregnant Woman Steal Baby-

తల్లి గర్భంలో ఉండగానే ఆ తల్లి పొట్టకోసి అత్యంత దారుణంగా చంపేసి బిడ్డని తీసుకుని పరారైన ఘటన చికాగో లో చోటుచేసుకుంది.ఈ ఘటన అక్కడ తీవ్ర కలకలం సృష్టించింది.19 ఏళ్ల మార్లెన్ ఓచోయో లోపెజ్ తొమ్మిది నెలల గర్భిణి.ఆర్థిక పరిస్థితులు అంత బాగాలేని కారణంగా తనకు పుట్టబోయే బిడ్డకు ఏదైనా సాయం చేయాలంటూ ఆమె ఇటీవల సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

దాంతో పలువురు ఆమె అభ్యర్థనకు స్పందించారు.అలా స్పందించిన వారిలో ఈ దారుణానికి పాల్పడిన క్లారిస్సా ఫిగ్యురోవా(46) కూడా ఉంది.అయితే తమ ఇంట్లో చిన్న పిల్ల బట్టలు ఉన్నాయని.వచ్చి తీసుకెళ్లమని మార్లేన్కు క్లారిస్సా ఫోన్ చేసి చెప్పడం తో ఒక్క క్షణం కూడా ఆగకుండా భర్త తో చెప్పి స్నేహితురాలి ఇంటికి వెళ్ళిపోయింది.ఈ నేపథ్యంలో మార్లేన్ ఆమె ఇంటికివెళ్లగా.క్లారిస్సా, ఆమె కుమార్తె, కూతురు బాయ్ఫ్రెండ్ కలిసి గొంతునులిపి చంపేశారు.అనంతరం మార్లేన్ గర్భం నుంచి బిడ్డను బటయకు తీసి.బాడీని కాల్చేశారు.ఆమె కారును ఆ ప్రాంతంలోని ఓ పార్కింగ్ ఏరియాలో భద్రపరిచారు.అయితే బలవంతంగా బిడ్డను బయటకు తీయడంతో ఆ చిన్నారి అస్వస్థతకు గురైంది.

Mom Plotted To Kill Pregnant Woman, Steal Baby--Mom Plotted To Kill Pregnant Woman Steal Baby-

దీంతో 911 నంబర్కు ఫోన్ చేసి ఆసుపత్రికి తీసుకెళ్లారు.బిడ్డ ఊపిరి సరిగా తీసుకోవడం లేదని చికాగోలోని క్రిస్ట్ హాస్పిటల్లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.అయితే మార్లెన్ కనిపించడం లేదని ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడం తో ఈ విషయం బయటపడింది.మార్లెన్ ఫేస్ బుక్ పేజ్ లిస్ట్ ని చెక్ చేయగా లాస్ట్ మెస్సేజ్ లో క్లారిస్సా తో చాటింగ్ చేసిన విషయం తెలియడం తో ఆమె ఇంటికి వెళ్లగా అక్కడ మార్లెస్ కు చెందిన కొన్ని ఆనవాళ్లు దొరికాయి.

దీనితో ఆమెను గట్టిగా ప్రశ్నించగా అప్పుడు అసలు విషయం చెప్పింది.తన కొడుకు పురిట్లోనే చనిపోయాడని.అప్పటినుంచి ఎవరైనా చిన్న బాబును పెంచుకోవాలని అనుకున్నామని.కానీ సాధ్యపడలేదని క్లారిస్సా తెలిపింది...

ఈ లోపు సోషల్ మీడియాలో మార్లేన్ తన బిడ్డకు సాయం చేయమని కోరడంతో.ఆమె బిడ్డను దొంగతనం చేయాలని భావించినట్లు పేర్కొంది.

ఇందులో భాగంగానే బట్టలు ఇస్తామని చెప్పి మార్లేన్ ను ఇంటికి పిలిచి హత్య చేసినట్లు వెల్లడించింది.ఇందుకు తన కుమార్తె, ఆమె బాయ్ ఫ్రెండ్ సహాయం చేశారని వెల్లడించింది.దీంతో వారిని అరెస్ట్ చేసిన పోలీసులు జైలుకు తరలించారు.