బెడ్‌రూమ్‌లో పరాయి వ్యక్తితో తల్లి..! కూతురు నిలదీయడంతో ఆ తల్లి ఏం చేసిందో తెలుసా.?   Mom Caught Her Daughter Red Handed     2018-11-05   09:55:25  IST  Sainath G

బెడ్‌రూమ్‌‌లో మరో వ్యక్తితో తల్లి అభ్యంతరకర స్థితిలో ఉంది.. దీనిని తట్టుకోలేని కూతురు తల్లిని నిలదీసింది.. కూతురు తనను నిలదీసింది అని తట్టుకోలేక ఆ తల్లి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఖమ్మం జిల్లా జూలురుపాడులో చోటుచేసుకుంది. వివరాలలోకి వెళ్తే..

జూలురుపాడు గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలలో రోజువారీ కూలీగా పనిచేస్తోన్న సూర్నపాక కమల పడమటనర్సాపురంలో నివాసముంటోంది.ఆమెకు ఇరవైయేళ్ల క్రితం పెళ్లయ్యింది.. భర్త, కొడుకు, కూతురు ఉన్నారు.. అయితే భర్తతో మనస్పర్థల కారణంగా కుమార్తెతో కలిసి విడిగా ఉంటోంది. గత నెల 31న ఆమె కూతురు కావ్య తన స్నేహితురాలి ఇంటికి వెళ్లింది. ఈ నెల 3న తిరిగి ఇంటికి వచ్చేసరికి.. బెడ్‌రూమ్‌‌లో మరో వ్యక్తితో తల్లి అభ్యంతరకర స్థితిలో ఉంది..

దీంతో కావ్య తల్లిని నిలదీసింది. కూతురు తనను నిలదీయడాన్ని జీర్ణించుకోలేని కమల… ఆదివారం పురుగుల మందు తాగింది. ఆమెను వెంటనే హాస్పిటల్ కి తరలించారు. చికిత్సపొందుతూ మృతి చెందింది.