మలయాళం దర్శకుడు కమల్ పై నటి వేధింపుల కేసు

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ కాస్టింగ్ కౌచ్ మాటున జరుగుతున్న లైంగిక వేధింపులపై గళం విప్పుతూ మీటూ అంటూ ముందుకి వస్తున్నారు.హాలీవుడ్ లో మొదలైన ఈ ఉద్యమం ఇండియాలోని అన్ని చిత్ర పరిశ్రమలలోకి వచ్చింది.

 Malayalam Heroine Metoo Complaint On Director Kamal, Mollywood, Tollyood, Metoo,-TeluguStop.com

ఈ మీటూ ఉద్యమం తర్వాత ఇండస్ట్రీలో మహిళలపై లైంగిక వేధింపులు కొంత వరకు తగ్గాయని చెప్పాలి.అయితే తాజాగా మలయాళం ఇండస్ట్రీలో మంజూ వారియర్ అనే హీరోయిన్ దర్శకుడు, ఆ రాష్ట్ర చలన చిత్ర అకాడమీ చైర్మన్ కమల్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది.

అతనిపై పోలీసులకి ఫిర్యాదు చేసింది.ప్రణయ మీనుకలుడే కాదల్ సినిమాలో అవకాశం ఇస్తానని, దానికి ప్రతిఫలంగా తన కోరిక తీర్చాలని దర్శకుడు కమల్ కోరినట్టు నటి ఫిర్యాదులో పేర్కొంది.

మంజూ వారియర్ ప్రధాన పాత్రలో రెండేళ్ళ క్రితం కమల్ తెరకెక్కించిన ఆమి సినిమా చిత్రీకరణ సమయంలో ఇదంతా జరిగిందని ఆమె తెలిపారు.ఈ ఘటనపై 2019 ఏప్రిల్ 26న దర్శకుడు కమల్‌కు ఈ విషయమై లీగల్ నోటీసులు పంపించానని స్పష్టం చేసింది.

ఆమి సినిమా చిత్రీకరణ సమంలో కూడా తనని వేధించాడు అని మంజూ వారియర్ పేర్కొంది.దీనిపై దర్శకుడు కమల్ కూడా స్పందించాడు.ఆమె ఆధారాలు లేని ఆరోపణలతో గతేడాది నాకు లీగల్ నోటీసులు పంపిన మాట నిజమే.ఈ విషయంపై అప్పటికే నా న్యాయవాదిని సంప్రదించాను.

అవన్నీ తప్పుడు ఆరోపణలు అయినా నటి తర్వాత తీసుకునే చర్యలను బట్టి ముందుకు సాగుదాం అనుకున్నా.కానీ ఆ తర్వాత ఆమెప్పుడూ ఏ రకమైన చర్యలు తీసుకోలేదు.

దీంతో నేను వదిలిపెట్టాను.సమాజంలో నాకు ఉన్న పేరు ప్రతిష్టలను చెడగొట్టేందుకు ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేసింది.

ఆమె చేసిన ఆరోపణలని అంత తేలిగ్గా విడిచి పెట్టను.కచ్చితంగా తను కూడా లీగల్ యాక్షన్ తీసుకుంటా అని స్పష్టం చేశాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube