తన తండ్రి వయసున్న నటుడికి భార్య గా నటించడం పెద్దగా...

సినిమా పరిశ్రమలో రాణించాలంటే ఎలాంటి పాత్రలోనైనా నటించగలిగే నటనా ప్రతిభ మరియు సామర్థ్యం ఉండాలి.అలాంటప్పుడే మనలో ఉన్నటువంటి నటనా ప్రతిభ బయట పడుతుందని కొందరు సినీ విశ్లేషకులు అప్పుడప్పుడు చెబుతుంటారు.

 Molkki Serial Fame Priyal Mahajan About Her Acting Experience With Amar Upadhya-TeluguStop.com

అయితే తాజాగా ఓ హిందీ సీరియల్ నటి తన కంటే 25 సంవత్సరాలు పెద్దవాడయినటువంటి నటుడికి భార్యగా నటిస్తూ ప్రేక్షకులని బాగానే అలరిస్తోంది.

పూర్తి వివరాల్లోకి వెళితే హిందీలో ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానల్ అయిన కలర్స్ ఛానల్ లో ప్రసారమయ్యే “మోల్కి” అనే ధారావాహిక సినీ ప్రేక్షకులని బాగానే ఆకట్టుకుంటోంది.

అయితే ఈ ధారావాహికలో యంగ్ సీరియల్ నటి ప్రియాల్ మహాజన్, బాలీవుడ్ ప్రముఖ సీరియల్ నటుడు అమర్ ఉపాధ్యాయ మెయిన్ లీడ్ పాత్రలలో నటిస్తుండగా శ్రద్ధ జైస్వాల్, నేహా జురల్, తోరాల్ రస్పుత్ర, తదితరులు ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు.కాగా ఈ సీరియల్ ని బాలీవుడ్ ప్రముఖ సినీ నిర్మాత ఏక్తా కపూర్ నిర్మిస్తుండగా ప్రముఖ సీరియల్ దర్శకురాలు ముజమ్మిల్ దేశాయ్ దర్శకత్వం వహిస్తోంది.

కాగా తాజాగా ప్రియల్ మహాజాన్ ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూ లో పాల్గొని పలు ఆసక్తికర అంశాలను ప్రేక్షకులతో పంచుకుంది.

Telugu Amar Upadhyay, Bollywood, Molkki Serial, Molkkiserial, Priyal Mahajan, Se

ఇందులో భాగంగా తనకంటే 25 సంవత్సరాలు వయసు వ్యత్యాసం ఉన్నటువంటి నటుడితో నటించడం వల్ల తాను ఎన్నో విషయాలను నేర్చుకో గలిగానని చెప్పుకొచ్చింది.అంతేకాకుండా చిన్న వయసులోనే వివాహిత పాత్రలో నటించడం వల్ల తనకు వివాహం పట్ల ఎన్నో విషయాలు అవగతమయ్యాయని తెలిపింది.ఇక ఇదే సీరియల్ లో తన పిల్లల పాత్రలో నటిస్తున్న చైల్డ్ ఆర్టిస్టులు గురించి మాట్లాడుతూ అనుష్క శర్మ మరియు రిత్విక్ గుప్తా లు తనతో చాలా సరదాగా ఉంటారని దాంతో తాము అందరూ కలిసి సెట్లో చాలా అల్లరి చేస్తామని కూడా తెలిపారు.

అంతేకాక తాను నటి స్థానంలో ఉన్నప్పుడు ఎలాంటి పాత్రలోనైనా నటించడానికి సిద్ధంగా ఉండాలని అందువల్లనే “మోల్కి ” పాత్రని చాలెంజింగ్ గా తీసుకొని నటించానని చెప్పుకొచ్చింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube