నేడు పుట్టినరోజు జరుపుకుంటున్న మోక్షజ్ఞ... సినిమాల్లోకి ఎప్పుడు అంటున్న ఫ్యాన్స్...!

సినిమా ఇండస్ట్రీలో వారసత్వం అనేది ఎప్పటి నుండో ఉన్న విషయమే.ఇప్పటికే మన టాలీవుడ్ ఇండస్ట్రీలో కొన్ని కుటుంబాల నుంచి హీరో, హీరోయిన్లు తెలుగు తెరమీద కనబడుతూనే ఉన్నారు.

 Balakrishna, Nandhamuri Family, Akkineni Family, Manchu Family, Tollywood, Kalya-TeluguStop.com

ఇక ఈ విషయంలో మెగా ఫ్యామిలీ నుండి ఏకంగా 11 మంది హీరోలు సుపరిచితులు అయ్యారంటే మీరు నమ్మగలరా….? అలాగే నందమూరి ఫ్యామిలీ, అక్కినేని వారి ఫ్యామిలీ, ఘట్టమనేని వారి ఫ్యామిలీ, మంచు వారి ఫ్యామిలీ ఇలా కొన్ని కుటుంబాల నుండి వారి వారసులను సినీ ఇండస్ట్రీలోకి తీసుకు వస్తూనే ఉన్నారు.

ఇక అసలు విషయంలోకి వెళితే… నందమూరి కుటుంబం నుండి గత రెండు సంవత్సరాలుగా బాలయ్య బాబు కుమారుడు మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ గురించి ఎన్నో ఊహాగానాలు ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు నడుస్తూనే ఉన్నాయి.నేడు బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ పుట్టినరోజు.

దీంతో మరోసారి నందమూరి అభిమానులు మోక్షజ్ఞ ఎంట్రీ టాలీవుడ్ లో ఎప్పుడూ ఉంటుందని మరోసారి గుసగుసలు చేపడుతున్నారు.ఇక చివరగా 15 సంవత్సరాల క్రితం నందమూరి ఫ్యామిలీ నుండి కళ్యాణ్ రామ్ వచ్చిన తర్వాత మరో ఏ వ్యక్తి హీరో గా టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వలేదు.

ఇక దీంతో నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడు టాలీవుడ్ లో ఉంటుందని నందమూరి అభిమానులు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.అయితే తాజాగా బాలకృష్ణ 60 పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న మోక్షజ్ఞ ని చూసి అభిమానులు ఒకింత షాక్ కు గురయ్యారు.

దానికి కారణం మోక్షజ్ఞ పర్సనాలిటీ.ఆ కార్యక్రమంలో మోక్షజ్ఞ కాస్త ఒళ్ళు చేసి కనబడటంతో అభిమానులు కాసింత నిరాశ పడినట్టే అర్థం అవుతోంది.

నేడు మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు మరోసారి సోషల్ మీడియా వేదికగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి హీరోగా తన సత్తా చూపాలని వారు కోరుకుంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube