మొహం దాచుకుని వచ్చిన మోక్షజ్ఞ... మరీ ఇంత రహస్యం ఏంటో ఎవరికి అర్థం కావడం లేదు

నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ జనాలకు, మీడియాకు కనిపించక చాలా ఏళ్లు అవుతుంది.ప్రస్తుతం మోక్షజ్ఞ ఎలా ఉన్నాడో అనే విషయం ఎవరికి తెలియడం లేదు.

 Mokshagna Goes With Mask In Prasad Lab-TeluguStop.com

మోక్షజ్ఞ సినిమాల్లో ఎంట్రీ ఇస్తాడని 2018 మొత్తం నందమూరి అభిమానులు ఎదురు చూశారు.కాని మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ విషయం ఏమో కాని, అతడు ఎలా ఉన్నాడో అనే విషయం కూడా తెలియలేదు.2019లో అయినా మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తాడేమో చూడాలి.తాజాగా ప్రసాద్‌ ల్యాబ్స్‌లో మోక్షజ్ఞ మొహానికి మాస్క్‌ వేసుకుని కుటుంబ సభ్యులతో కేజీఎఫ్‌ చిత్రాన్ని చూసేందుకు వచ్చాడట.

‘ఎన్టీఆర్‌’ చిత్రం ఆడియో వేడుకకు నందమూరి కుటుంబ సభ్యులు అంతా కూడా వచ్చారు.కాని మోక్షజ్ఞ మాత్రం మిస్‌ అయ్యాడు.అందరు వచ్చి ఆయనే మిస్‌ అవ్వడం వెనుక కారణం ఏంటీ అంటూ లుక్‌ రివీల్‌ కావద్దంటున్నారు.ఇంత రహస్యంగా మోక్షజ్ఞ లుక్‌ రివీల్‌ కాకుండా ఉంచాల్సిన అవసరం ఏంటీ అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.

మోక్షజ్ఞ బాగా లావు అయ్యాడని, ఆ కారణం వల్లే అతడి లుక్‌ను బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారు అంటూ కొందరు చెబుతున్నారు.మీడియాలో అతడి లుక్‌ వస్తే మొదటి సినిమా సమయంలో ఇష్టం వచ్చినట్లుగా మీమ్స్‌ వస్తాయని అలా జాగ్రత్త పడుతున్నారు అంటూ టాక్‌ వినిపిస్తుంది.

మోక్షజ్ఞ లావు తగ్గేందుకు చాలా ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.అందుకోసం ఎక్కువ ఎక్కువ సమయం జిమ్‌లో వర్కౌట్లు చేస్తున్నాడట.ఇటీవల ప్రసాద్‌ ల్యాబ్‌లో మోక్షజ్ఞను చూసిన వారు చాలా లావు తగ్గాడు అంటూ మోక్షజ్ఞ గురించి చెబుతున్నారు.మోక్షజ్ఞ మూవీ ఈ ఏడాది ప్రారంభం అయ్యి, వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాల వారు అంటున్నారు.

సినిమా ప్రారంభం అయిన తర్వాత కూడా మోక్షజ్ఞను అంతే రహస్యంగా ఉంచుతారేమో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube