మోక్షజ్ఞ బాధ్యత తీసుకుంటున్న బుచ్చిబాబు..!

నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ తెరంగేట్రం కోసం నందమూరి ఫ్యాన్స్ ఎంతో ఎక్సయిటింగ్ గా ఎదురుచూస్తున్నారు.బాలయ్య సినిమాల్లోనే కెమియో రోల్ లో మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని అప్పట్లో హడావిడి చేశారు.

 Mokshagna Debut Movie Bucchi Babu Direction-TeluguStop.com

కాని అది కుదరలేదు.ఫైనల్ గా ఈమధ్యనే బాలకృష్ణ ఆదిత్య 369 సీక్వల్ లో మోక్షజ్ఞ నటించే ఛాన్స్ ఉందని హింట్ ఇచ్చాడు.

అయితే ఇదే కాకుండా మోక్షజ్ఞని ఒక చిన్న స్నిమాతో తెరంగేట్రం చేయించాలనే ప్లాన్ లో ఉన్నాడట బాలకృష్ణ.

 Mokshagna Debut Movie Bucchi Babu Direction-మోక్షజ్ఞ బాధ్యత తీసుకుంటున్న బుచ్చిబాబు..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ క్రమంలో ఉప్పెన ఫేమ్ బుచ్చి బాబుతో చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తుంది.

ఉప్పెన సినిమాతో మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ ను పరిచయం చేశాడు బుచ్చిబాబు.ఆ సినిమా తర్వాత వైష్ణవ్ తేజ్ రేంజ్ ఏంటన్నది అందరికి తెలిసిందే.

ఇప్పుడు మోక్షజ్ఞని కూడా బుచ్చి బాబు డైరక్షన్ లో సినిమా చేసేలా డిస్కషన్స్ నడుస్తున్నాయి.ఈ వార్తల్లో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు కాని మోక్షజ్ఞ ఎంట్రీపై నందమూరి ఫ్యాన్స్ మాత్రం చాలా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.

బుచ్చి బాబు డైరక్షన్ లో అయితే మాత్రం కచ్చితంగా సినిమా మీద అంచనాలు భారీగా ఉండే అవకాశం ఉంటుంది. ఉప్పెన తర్వాత బుచ్చి బాబు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ఎలాంటి అప్డేట్ బయటకు రాలేదు.

#Mokshagna #Bucchi Babu #MokshagnaCameo #MokshagnaDebut #Uppena

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు