సీఎస్కే కు మొయిన్ అలీ ఝలక్... అదేంటంటే?

ప్రతి క్రికెటర్ కొన్ని కొన్ని ప్రత్యేక లక్షణాలను కలిగి ఉంటారు.ఒక్కొక్కరు ఒక్కోలా తమ జీవితానికి సంబంధించిన కొన్ని నిబంధనలను కలిగి ఉంటారు.

 Moin Ali Jhalak To Csk  Is That So, Ipl ,chennai Super Kings-TeluguStop.com

ఉదాహరణకు తీసుకుంటే భారత క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ తన క్రికెట్ జీవితంలో ఎన్నో రకాల బ్రాండ్ లకు బ్రాండ్ అంబాసిడర్ గా చేసినా ఆల్కాహాల్ బ్రాండ్ లకు, పాన్, గుట్కా లాంటి బ్రాండ్ లకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండలేనని కఠిన నిర్ణయం తీసుకొని ఇప్పటివరకు అటువంటి యాడ్స్ లలో గాని సచిన్ నటించలేదు.అయితే అలాగే కొంత మంది క్రికెటర్లకు కొన్ని వ్యక్తిగత నిబంధనలు ఉంటాయి.

ఇక అసలు విషయంలోకి వస్తే ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ మొయిన్ అలీ సీఎస్కే తరపున ఆడుతున్న విషయం తెలిసిందే.మొయిన్ అలీని సీఎస్కే 7 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది.

అయితే తాజాగా జెర్సీ విషయంలో సీఎస్కేకు మొయిన్ అలీ ఝలక్ ఇచ్చాడు.సీఎస్కే జెర్సీపై ఆల్కాహాల్ కు సంబంధిత ఒక ఎస్ఎన్ జె 1000 లోగొ ఉన్న విషయం తెలిసిందే.

అయితే స్వతహాగా అల్కాహాల్ బ్రాండ్స్ కు సంబంధిత లోగోలు ఉన్న జెర్సీని మొయిన్ అలీ ఎక్కువ ఇష్టపడడు.అందుకే సీఎస్కేని ఎటువంటి లోగోలు లేని జెర్సీని ఇవ్వవలసిందిగా అలీ కోరాడు.

అలీ కోరిక మేరకు లోగోలు లేని జెర్సీని ఇచ్చేందుకు సీఎస్కే అంగీకరించినట్టు సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube