భారతీయ ఫుట్‌బాల్ క్లబ్‌కు న్యూయార్క్ టైమ్స్ స్కేర్‌‌లో అరుదైన గౌరవం

భారతదేశంలో క్రికెట్ ఒక మతం అయితే క్రికెటర్లు దేవుళ్లు.అలా క్రికెట్ రాజ్యమేలుతున్న దేశంలో ఫుట్‌బాల్‌‌ను బతికిస్తున్న సంస్థల్లో ప్రతిష్టాత్మక మోహన్ బగాన్ క్లబ్ ఒకటి.131 ఏళ్ల చరిత్ర గల ఈ క్లబ్‌కు బుధవారం అరుదైన గౌరవం దక్కింది.న్యూయార్క్‌లోని ప్రతిష్టాత్మక టైమ్స్ స్క్వేర్‌లో నాస్‌డాక్ బిల్ బోర్డులపై క్లబ్ లోగోను, జట్టు రంగులను ప్రత్యేకంగా ప్రదర్శించారు.

 Mohun Bagan Becomes First Indian Sports Team To Feature On Nasdaq, Nasdaq, Mohun-TeluguStop.com

భారతదేశం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఏ క్రీడలకు సంబంధించిన జట్టు గురించైనా నాస్‌డాక్ బిల్ బోర్డుపై ప్రదర్శించడం ఇదే ప్రప్రథమం.

జూలై 29, 1911లో ప్రతిష్టాత్మక ఐఎఫ్ఏ షీల్డ్ టోర్నీలో భాగంగా మోహన్ బగాన్ జట్టు 2-1 తేడాతో బ్రిటన్‌కు చెందిన ఈస్ట్ యార్క్‌షైర్ రెజిమెంట్‌ జట్టును ఓడించింది.

భారత స్వాతంత్య్రోద్యమ కాలంలో ఈ జట్టు సాధించిన గెలుపుకు ఎంతో ప్రాధాన్యత లభించింది.అందుకే జూలై 29ని మోహన్ బగాన్ డే‌గా జరుపుకుంటారు.

ఈ సందర్భాన్ని పురస్కరించుకుని న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లో ఈ విధంగా గౌరవించారు.కాగా, తమ జట్టుకు దక్కిన ఈ గౌరవం పట్ల మోహన్ బగాన్ యాజమాన్యం హర్షం వ్యక్తం చేసింది.

దీని వల్ల తమ జట్టు ఎంత ప్రత్యేకమైందో చూపించిందని అభిమానులు సైతం సంతోషం వ్యక్తం చేశారు.మరోవైపు ప్రపంచ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) కూడా మోహన్ బగాన్ డే కు దక్కిన గౌరవంపై అభినందనలు తెలిపింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube