సిరాజ్ దెబ్బకు ఐపీఎల్ లో రికార్డుల మోత..!

తాజాగా జరిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, కోల్కత్తా నైట్ రైడర్స్ మ్యాచ్ లో అనేక రికార్డులు బద్దలయ్యాయి.అందులో ముఖ్యంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బౌలర్ మహమ్మద్ సిరాజ్ సంచలనం సృష్టించాడు.

 Rcb, Mohamad Siraj, Ipl, Ipl 2020, Records, Kkr, Ipl Match, Kolkatta Night Rider-TeluguStop.com

బుల్లెట్ వేగంతో బంతులను వేసి కోల్కత్తా నైట్ రైడర్స్ పతనాన్ని శాసించాడు.తాను బౌలింగ్ చేసిన సమయంలో తన నిర్దేశిత 4 ఓవర్ల ఖాతాలో రెండు ఓవర్లను మేడిన్ ఓవర్ గా వేసి, మిగితా రెండు ఓవర్లలో కూడా కేవలం 8 పరుగులు మాత్రమే ఇచ్చి 3 ప్రధాన వికెట్లను నేలకూల్చాడు.

అంతేకాదు తాను వేసిన 24 బంతుల్లో 16 డాట్ బాల్స్ వచ్చాయి.

ఇక సిరాజ్ ఈ మ్యాచ్ లో తన రెండు మొదటి ఓవర్లను మేడిన్ చేశాడు.

అందులో కూడా 3 ప్రధాన వికెట్లను పడగొట్టాడు.తన మొదటి ఓవర్ లో కేకేఆర్ బ్యాట్స్మెన్స్ రాహుల్ త్రిపాటి, నితీష్ రాణా ను అవుట్ చేయగా నాలుగు ఓవర్ లో మరోసారి టామ్ బాటన్ ను కూడా పెవిలియన్ కు చేర్చాడు.

ఈ బౌలింగ్ తో ఐపీఎల్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఒకే మ్యాచ్ లో రెండు ఓవర్లను మేడిన్ చేసిన తొలి బౌలర్ గా సిరాజ్ రికార్డు సృష్టించాడు.అలాగే ఒక పరుగు కూడా ఇవ్వకుండా 3 వికెట్లు తీసుకున్న రెండో బౌలర్ గా రికార్డులకెక్కాడు.

ఒక బౌలర్ మొదటి పరుగును ఇవ్వడానికి కి ముందు అత్యధిక డాట్ బాల్స్ ( 12 బంతులు) వేసిన బౌలర్ గా కూడా సిరాజ్ రికార్డులకెక్కాడు.

సిరాజ్ దెబ్బకు కోల్కతా నైట్ రైడర్స్ మరికొన్ని చెత్త రికార్డును మోయాల్సి వచ్చింది.

అదేమిటంటే.అతి తక్కువ స్కోరుకే మొదటి 3 వికెట్లు కోల్పోయిన జట్లలో కేకేఆర్ స్థానం పొందింది.

ఇకపోతే ఇప్పటివరకు మహమ్మద్ సిరాజ్ ఈ ఐపీఎల్ టోర్నీలో మొత్తం 4 మ్యాచ్ లు ఆడగా అందులో 6 వికెట్లను మాత్రమే తీయగలిగాడు.అందులో ఈ మ్యాచ్ లో తీసిన మూడు వికెట్లు ఉండడం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube