ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్ బాబాయ్ గా కనిపించనున్న సూపర్ స్టార్

దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కుతున్న భారీ మల్టీ స్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ మూవీ షూటింగ్ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే.తాజాగా ఈ సినిమాకి సంబందించిన టైటిల్ టీజర్, రామ్ చరణ్ పాత్రకి సంబందించిన టీజర్ ని జక్కన్న ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చారు.

 Mohanlal Roped In For A Cameo In S.s. Rajamouli's Rrr, Tollywood, Kollywood, Bol-TeluguStop.com

వీటిని చూసిన తర్వాత సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి.ఇప్పటికే ఈ సినిమాలో హాలీవుడ్, బాలీవుడ్ కి చెందిన స్టార్ కాస్టింగ్ ని రాజమౌళి ఫైనల్ చేశాడు.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం మలయాళీ సూపర్ స్టార్ మోహన్ లాల్ ని ఎంపిక చేసినట్లు తెలుస్తుంది.

అయితే మోహన్ లాల్ పాత్ర సినిమాలో ఎలా ఉండబోతుంది అనే ఆసక్తి ఇప్పుడు నెలకొని ఉంది.

ఈ సినిమాలో ఎన్టీఅర్ కొమరమ్ భీమ్ పాత్రలో నాటించబోతూ ఉండగా అతనికి బాబాయ్ గా మోహన్ లాల్ కనిపిస్తాడని తెలుస్తుంది.కొమరమ్ భీమ్ జీవితంలో ఆయన బాబాయ్ పాత్ర చాలా ఉందని ఆయన కథ ఆధారంగా తెలుస్తుంది.

భీమ్ పోరాట పటిమను, ఆయనలో ఉద్యమ కాంక్షని రగిల్చిన ఆ పాత్రలో మోహన్ లాల్ కనిపిస్తాడని తెలుస్తుంది.ఇక మోహన్ లాల్ పాత్ర కూడా ఆర్ఆర్ఆర్ లో పెట్టడంతో మలయాళంలో కూడా ఈ సినిమాకి మంచి క్రేజ్ వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.

మొత్తానికి రాజమౌళి కచ్చితమైన లెక్కలు వేసుకొని సినిమాని మార్కెట్ చేసుకోవడానికి సరిపోయే విధంగా కాస్టింగ్ ని ఫైనల్ చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube