మళయాళ మెగాస్టార్ మోహన్ లాల్ శుక్రవారం 62వ పుట్టినరోజు జరుపుకున్నారు.మళయాళ చిత్ర పరిశ్రమలో విలక్షణ నటుడిగా ప్రేక్షకులను మెప్పిస్తూ వస్తున్న మోహన్ లాల్ సౌత్ ఆడియెన్స్ ను అలరిస్తున్నారు.
ఇక కరోనా టైం లో తన బర్త్ డే సందర్భంగా గొప్ప పని చేశారు.కరోనా వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
కేరళలో కూడా కొవిడ్ విజృంభిస్తుంది.ఈ క్రమంలో తన వంతు సాయంగా మోహన్ లాల్ తన విశ్వశాంతి ఫౌండేషన్ ద్వారా కేరళలో వివిధ ప్రాంతాల్లోని హాస్పిటల్స్ కు ఆక్సిజన్ సౌకర్యంతో పాటుగా బెడ్స్, వెంటిలేటర్స్ ను అందించారు.
కరోనా సెకండ్ వేవ్ లో ఆక్సిజన్, బెడ్ల కొరత ఎక్కువగా ఉంది.మోహన్ లాల్ విశ్వశాంతి ఫౌండేషన్ ద్వారా 3 ఫోల్డ్ బెడ్స్, 10 వెంటిలేటర్ సిస్టెం ఉన్న ఐసియు బెడ్స్, పోర్టబుల్ ఎక్స్ రే మిషన్స్ ను వివిధ హాస్పిటల్స్ కు అందించారు.
మెడికల్ కాలేజ్ లోని రెండు వార్డులకు ఆక్సిజన్ పైప్ లైన్స్ కూడా ఈ ఫౌండేషన్ ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది.గర్నమెంట్, కో ఆపరేటివ్, ప్రైవేట్ సెక్టార్ హాస్పిటల్స్ కు వీటిని అందించినట్టు విశ్వశాంతి ఫౌండేషన్ నిర్వాహకులు తెలిపారు.
కేరళ ప్రభుత్వ హెల్త్ కేర్ స్కీం కింద వచ్చే హాస్పిటల్స్ కే వాటిని అందించినట్టు సమాచారం.ఫౌండేషన్ ద్వారా మరింత సేవలను అందించనున్నట్టు తెలుస్తుంది.
కేరళ బయట ఉన్న హాస్పిటల్స్ లో కూడా ఈ సౌకర్యాలను అందచేయనున్నట్టు చెబుతున్నారు.