కరోనా ఎఫెక్ట్ : వాళ్ళందరూ బిగ్ బాస్ విజేతలే....

ప్రస్తుతం దేశంలో ప్రాచుర్యం పొందిన భాషల్లో బిగ్ బాస్ రియాల్టీ గేమ్ షో ఎంతగా ప్రాచుర్యం పొందిందో అందరికీ బాగానే తెలుసు.ఇప్పటికే ఈ రియాల్టీ షో హిందీలో వియజయవంతంగా 13 సీజన్లు, తెలుగులో 3సీజన్లు, తమిళంలో 3సీజన్లు, పూర్తిచేసుకుంది.

 Mohanlal Announces 10 Members As A Winners-TeluguStop.com

అయితే తాజాగా మలయాళంలో 2వ సీజన్ కి మోహన్ లాల్ హోస్టుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసందే.

అయితే ప్రస్తుతం దేశంల;ఓ కరోనా వైరస్ వ్యాప్తు చెందుతుండటంతో పలు రాష్ట్ర ప్రభుత్వాలు ముందస్తు చర్యల్లో భాగంగా లాక్ డౌన్ ని ప్రకటించారు.

కాగా ఈ ప్రభావం బిగ్ బాస్ రియాల్టీ షో పై కూడా పడింది.దీంతో మోహన్ లాల్ తాజాగా బిగ్ బాస్ ఇంట్లో ఇప్పటివరకూ మిగిలిన అభ్యర్థులందరిని విజేతలుగా ప్రకటించారు.అంతేగాక ఈ సీజన్ కి ప్రధానం చేసే విన్నర్ ట్రోఫీ ని కూడా అందరికీ అండ జేశారు.అయితే బిగ్ బాస్ కార్యక్రమంలో ఇలా పది మంది విజేతలను ప్రకటించడం ఇదే తొలిసారి కావడం విశేషం.

Telugu Mohanlal, Mohanlal Latest-Movie

అయితే ఈ విషయం ఇలా ఉండగా ఈ కరోనా వైరస్ కారణంగా రాష్ట్రంలోని సినిమా థియేటర్లు, జన సాంద్రత ఎక్కువ ఉన్న ప్రదేశాలను మూసి వేశారు.అంతేగాక పలు చిత్రాలు మరియు సీరియళ్లు సంబంధిత షూటింగులను కూడా నిలిపివేశారు.అందువల్లనే బిగ్ బాస్ రియాల్టీ నిర్వాహకులు కూడా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube