టక్ వేసి మరీ కాపీ కొడుతున్న నాని

నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం రెండు చిత్రాలను రెడీ చేస్తున్నాడు.ఇప్పటికే దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వి’ సినిమాలో నాని విలన్ అవతారంలో మనకు కనిపిస్తున్నట్లు ఫస్ట్ లుక్ పోస్టర్ ద్వారా చిత్ర యూనిట్ తెలిపింది.

 Mohana Krishna Nani Jagadish Balaramakrishnulu-TeluguStop.com

ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అవుతున్నాయి.కాగా తన నెక్ట్స్ మూవీని శివ నిర్వాణ దర్శకత్వంలో రెడీ చేస్తున్నాడు నాని.

ఈ సినిమాకు ‘టక్ జగదీష్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే.కాగా ఈ సినిమా కథకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది.

ఈ సినిమా కథను ఓ పాత చిత్రం నుండి తీసుకున్నట్లు తెలుస్తోంది.ఈ సినిమాలో నానితో పాటు జగపతి బాబు కలిసి నటిస్తున్నట్లు, అన్నదమ్ముల మధ్య సాగే కథ అని తెలుస్తోంది.

ఈ కథను గతంలో వచ్చిన బలరామకృష్ణులు సినిమా నుండి స్ఫూర్తి పొందినట్లు చిత్ర యూనిట్ తెలిపింది.కాగా ఆ చిత్రంలో శోభన్ బాబు, రాజశేఖర్ నటించగా, ఆ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది.

కాస్త మార్పులు చేసి ఈ కథను టక్ జగదీష్‌ మూవీగా మనకు చూపించనున్నాడు దర్శకుడు శివ నిర్వాణ.ఈ సినిమాలో నాని సరసన రీతూ వర్మ హీరోయిన్‌గా నటిస్తోంది.

ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నారు.మరి ఈ సినిమా బలరామకృష్ణులు సినిమాకు కాపీయా లేక స్ఫూర్తియా అనేది సినిమా రిలీజ్ అయ్యాకే తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube