కొడుకుతో టాలీవుడ్ హీరోయిన్ ఎఫైర్.. స్పందించిన తండ్రి... 

ప్రస్తుత కాలంలో కొందరు సెలబ్రెటీల గురించి ఏదైనా ఓ వార్త బయటకు వచ్చింది అంటే చాలు వాటి గురించి లేనిపోని కథనాలు అల్లి నిజమా కాదా తెలుసుకోకుందా ప్రచారాలను చేస్తుంటారు.దీంతో తాజాగా టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్ మలయాళ సినీ పరిశ్రమకు చెందినటువంటి స్టార్ హీరో మోహన్ లాల్  కొడుకుతో గత కొద్ది కాలంగా ప్రేమాయణం నడిపిస్తుందని పలు వార్తలు సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ చెక్కర్లు కొడుతున్నాయి.

 Mohan Lal,  Love Affair,  Kalyani Priyadarshan, Tollywood Heroine,  Pranav Mohan-TeluguStop.com

దీంతో తాజాగా ఈ విషయంపై మోహన్ లాల్  స్పందించాడు. ఇందులో భాగంగా తన కొడుకుతో కళ్యాణి ప్రియదర్శన్ ఎలాంటి ప్రేమాయణం సాగించలేదని స్పష్టం చేశాడు.  అంతేగాక వారిద్దరూ చిన్నప్పటినుంచి మంచి స్నేహితులని అలాగే తన కుటుంబానికి మరియు కళ్యాణి ప్రియదర్శన్ కుటుంబానికి మంచి సన్నిహిత సంబంధాలున్నాయని అందువలన అందరూ తప్పుగా అనుకుంటున్నారని తెలిపాడు.  అంతేగాక ఇద్దరు వ్యక్తులు కొంతమేర చనువుగా మెలుగుతూ ఉంటే కేవలం వారిద్దరి మధ్య ప్రేమ మాత్రమే ఉన్నట్లు కాదని స్నేహం కూడా ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం మలయాళంలో మోహన్ లాల్  “మరాక్కర్” అనే చిత్రంలో ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటిస్తున్నాడు. అంతేగాక దృశ్యం – 2  అనే చిత్రంలో కూడా ఇటీవలే నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

 దీంతో ప్రస్తుతం మోహన్ లాల్ మాలీవుడ్ లో బిజీ బిజీగా గడుపుతున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube