సూపర్‌ స్టార్‌ సినిమా డబుల్‌ షో కు నో చెప్పిన థియేటర్ల యాజమాన్యాలు

మలయాళ సూపర్‌ స్టార్‌ మోహన్ లాల్ నటించిన దృశ్యం 2 సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.దృశ్యం 2 సినిమాను డిజిటల్‌ ప్లాట్ ఫామ్ ద్వారా విడుదల చేయబోతున్న విషయం తెల్సిందే.

 Mohan Laal Drishyam 2 Update About Theater Release,drishyam 2, Mohan Laal , Dris-TeluguStop.com

ఈ సినిమాను నిర్మాతలు ఆర్థిక అవసరాల నిమిత్తం కొన్ని నెలల క్రితమే అమెజాన్ కు అమ్మేశారు.ఆ సమయంలో థియేటర్లు ఎప్పటికి ఓపెన్‌ అయ్యేది తెలియని నేపథ్యంలో డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ కు అమ్మేశారు.

ఇప్పుడు థియేటర్లు నూరు శాతం నడిపేందుకు ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చాయి.దాంతో దృశ్యం 2 ను థియేటర్లలో కూడా విడుదల చేయాలని మేకర్స్‌ ప్రయత్నాలు చేశారు.

అందుకు అమెజాన్‌ ఓకే చెప్పినా కూడా థియేటర్ల యాజమాన్యాలు మాత్రం నో చెప్పాయి.

డిజిటల్‌ లో మరియు థియేటర్లలో ఒకే సారి విడుదలకు అస్సలు ఒప్పుకునేది లేదు అంటూ తేల్చి చెప్పారు.

మార్జిన్‌ ఎక్కువ ఇచ్చినా కూడ ఆ నిర్మాతల ప్రపోజల్‌ ను అంగీకరించేది లేదు అంటూ థియేటర్ల యాజమాన్యాలు చెబుతున్నాయి.దృశ్యం 2 సినిమాను థియేటర్లలో విడుదల చేయాలంటే ఖచ్చితంగా 40 రోజుల పాటు డిజిటల్ రిలీజ్ కు ఒప్పుకోము అంటూ ఒప్పందం ఇవ్వాలి.

అప్పుడే థియేటర్‌ రిలీజ్ కు ఓకే చెప్తామంటూ యాజమాన్యాలు చెబుతున్నాయి.దాంతో సూపర్ స్టార్‌ మోహన్‌ లాల్‌ సినిమా థియేటర్ల రిలీజ్ లేదని తేలిపోయింది.దృశ్యం సినిమా మలయాళంలోనే కాకుండా తెలుగు, హిందీ, తమిళంలో కూడా మంచి విజయాన్నిసొంతం చేసుకున్నాయి.కనుక ఈ సినిమా సినిమా ను కూడా రీమేక్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

ఇప్పటికే తెలుగు లో వెంకీ తో రీమేక్‌ చేసేందుకు ఒప్పందాలు జరిగాయి అంటూ వార్తలు వస్తున్నాయి.త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

దృశ్యం 2 తెలుగు త్వరలోనే పట్టాలెక్కే అవకాశం ఉందంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube