మోహన్ భగవత్ కాన్వాయ్ ఢీకొని చిన్నారి మృతి  

Mohan Bhagwat Convoy Hits 6 Years Old Boy-nagpure,rajasthan Alwar Distict

ఆరేళ్ల బాలుడు ఆర్ ఎస్ ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కాన్వాయ్ ఢీ కొని మృతి చెందినట్లు తెలుస్తుంది.వివరాల్లోకి వెళితే… రాజస్థాన్ లోని అల్వార్ జిల్లా లో తాతతో కలిసి ఆరేళ్ల చిన్నారి బైక్ పై వెళుతున్నారు.ఈ సమయంలో వారి వాహనాన్ని మోహన్ భగవత్ కాన్వాయ్ లోని ఒక కారు ఢీ కొనింది.

Mohan Bhagwat Convoy Hits 6 Years Old Boy-nagpure,rajasthan Alwar Distict-Mohan Bhagwat Convoy Hits 6 Years Old Boy-Nagpure Rajasthan Alwar Distict

ఈ క్రమంలో ఆ చిన్నారి మృతి చెందగా,బాలుడి తాత మాత్రం గాయపడినట్లు తెలుస్తుంది.తిజారాలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న మోహన్ భగవత్ నాగ్‌పూర్‌కు తిరుగు ప్రయాణం అయిన సమయంలో మధ్యే మార్గంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తుంది.

Mohan Bhagwat Convoy Hits 6 Years Old Boy-nagpure,rajasthan Alwar Distict-Mohan Bhagwat Convoy Hits 6 Years Old Boy-Nagpure Rajasthan Alwar Distict

ఆర్ ఎస్ ఎస్ చీఫ్ అయిన మోహన్ భగవత్ కు జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉంది.దీనితో ఆయన కాన్వాయ్ లో మొత్తం 8 నుంచి 10 వాహనాలు ఉన్నట్లు తెలుస్తుంది.అయితే ఆ వాహనాల్లో ఒకటి మాత్రం ఆ బాలుడు,తాత ప్రయాణించే వాహనాన్ని ఢీకొనడం తో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది.

అయితే ఈ ఘటనలో మృతి చెందిన బాలుడిని సచిన్ గా గుర్తించినట్లు తెలుస్తుంది.ప్రస్తుతం ప్రమాదానికి కారణమైన కారును ఇంకా సీజ్ చేయలేదని,కారు రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసినట్లు స్థానిక పోలీసులు తెలిపారు.