మోహన్ బాబు మాస్టర్ ప్లాన్.. పవన్ వద్దకు మంచు మనోజ్ వెళ్లింది అందుకేనా?

ఇటీవలే తెలుగు సినీ ఇండస్ట్రీలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు ఓ రేంజ్ లో జరిగిన సంగతి తెలిసిందే.అందులో మంచు మోహన్ బాబు కుమారుడు మంచు విష్ణు గెలుపొందాడు.

 Mohan Babu Master Plan Is That Why Manchu Manoj Went To Pawan Kalyan Details,  M-TeluguStop.com

ఇక అప్పటి నుంచి మోహన్ బాబుకు సినీ ఇండస్ట్రీ నుండి మరింత గట్టి బలం ఏర్పడింది.అంతేకాకుండా ఈ సమయంలో తన విమర్శకులను కూడా తన వైపు మలుపుకుంటున్నాడు.

ఇప్పటికే మోహన్ బాబుకు పవన్ కళ్యాణ్ కు మధ్య బాగా వివాదాలు ఉన్నాయి.ఇక ఆ వివాదం కూడా ‘మా’ ఎలక్షన్ ల తర్వాత సద్దుమణిగింది అని తెలుస్తుంది.

అంతే కాకుండా తాజాగా మోహన్ బాబు కుమారుడు మంచు మనోజ్ కూడా పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్లి కాసేపు చర్చలు జరిపినట్లు తెలుస్తుంది.

గత కొన్ని రోజుల కిందట రిపబ్లిక్ సినిమా విడుదలకు ముందు సినిమా ఈవెంట్ ఫంక్షన్ లో పవన్ కళ్యాణ్ ఆంధ్ర ప్రదేశ్ మంత్రులపై ఎంతలా విమర్శలు చేశాడో చూసాం.

అంతేకాకుండా మోహన్ బాబు పై కూడా కొన్ని విమర్శలు చేశాడు.ఇక ఆంధ్రప్రదేశ్ మంత్రులపై విమర్శలు చేసిన పవన్ కళ్యాణ్ కు పోసాని గట్టిగా రీకౌంటర్ ఇచ్చాడు.

ఇక మోహన్ బాబు కూడా పవన్ కళ్యాణ్ కు ఎప్పుడు కౌంటర్ ఇస్తాడా అని ఆంధ్ర ప్రదేశ్ మంత్రులు బాగా ఎదురుచూశారు.కానీ మోహన్ బాబు ఎలక్షన్ ల తర్వాత మాట్లాడుతాను అని ఊరుకున్నాడు.

మొత్తానికి ఎలక్షన్ లు పూర్తికాగా.ఎలక్షన్ రోజు మోహన్ బాబు, మనోజ్.

పవన్ కళ్యాణ్ తో అక్కడే కాసేపు పక్కకు వెళ్లి చర్చలు కూడా చేసినట్లు తెలిసింది.

Telugu Bheemla Nayak, Chiranjeevi, Maa, Manchu Manoj, Manchumanoj, Master, Mohan

ఇదిలా ఉంటే ప్రస్తుతం భీమ్లా నాయక్ షూటింగ్ బిజీలో ఉన్న పవన్ కళ్యాణ్ దగ్గరకు మంచు మనోజ్ వెళ్లి అక్కడ కాసేపు పవన్ తో చర్చలు జరిపినట్లు తెలిసింది.అది కూడా మోహన్ బాబు పంపించి ఉండొచ్చన్న అభిప్రాయాలు తెలుస్తుంది.కారణం ప్రస్తుతం మా అధ్యక్ష బాధ్యతలు అందుకున్న మంచు విష్ణు ఏకపక్షంగా ముందుకు వెళ్లడం అసాధ్యం.

Telugu Bheemla Nayak, Chiranjeevi, Maa, Manchu Manoj, Manchumanoj, Master, Mohan

దీంతో మోహన్ బాబే స్వయంగా తన విమర్శకులతో కూడా సంబంధాలు పెంచుకుంటున్నట్లు తెలుస్తుంది.మంచు విష్ణు కూడా చిరంజీవిని కలవడానికి సిద్ధంగా ఉన్నాడు.ఇదివరకే మోహన్ బాబుకు పవన్ కళ్యాణ్ తో వాదనలు ఉన్నా కూడా మోహన్ బాబు సైలెంట్ గా ఉండటంతో అందరూ మోహన్ బాబు ఈ విధంగానే ఆలోచిస్తున్నారని అనుకుంటున్నారు.

Telugu Bheemla Nayak, Chiranjeevi, Maa, Manchu Manoj, Manchumanoj, Master, Mohan

ఇంతకుముందు పవన్ కళ్యాణ్ తనపై చేసిన విమర్శల గురించి కూడా మాట్లాడాలని అనుకోవడం లేదని తెలిసింది.మొత్తానికి ఈ వివాదాలకు దూరంగా ఉంటూ అందరినీ కలుసుకునే ప్రయత్నం చేస్తున్నాడు మోహన్ బాబు.అందుకే మంచు మనోజ్ ను పవన్ కళ్యాణ్ దగ్గరకు పంపించినట్లు ఇక ఈ విషయాల గురించి చర్చించినట్లు తెలుస్తుంది.

ఒకవేళ ఇదే నిజమైతే మా ఎలక్షన్ ల యుద్ధం ముగియడం గ్యారెంటీ.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube