వీడియో : సినిమా కూడా ఇలాగే ఉంటుందా 'సన్నాఫ్ ఇండియా'?

మంచు హీరోలకు ఈమద్య అస్సలే టైమ్ కలిసి రావడం లేదు.వారు ఏ సినిమా చేసినా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడుతోంది.

 Mohan Babu Son Of India Song Jayajayamahavera Lyrical-TeluguStop.com

తెలుగు సినిమా చరిత్రలో మంచు వారికి అంటూ ఒక ప్రత్యేక గౌరవం స్థానం ఉండేది.కాని పరిస్థితులు చూస్తుంటే మరీ దారుణంగా ఉన్నాయి.

మోహన్‌ బాబు కాస్త సినిమా లను తగ్గించాడు. మంచు విష్ణు జోరుగా సినిమా లు చేస్తూ బాక్సాఫీస్ వద్ద అవి ఆడటం లేదు.

 Mohan Babu Son Of India Song Jayajayamahavera Lyrical-వీడియో : సినిమా కూడా ఇలాగే ఉంటుందా సన్నాఫ్ ఇండియా’-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక మనోజ్ సినిమాల విషయానికి వస్తే ఆయన సినిమా చేసి చాలా కాలం అయ్యింది.ఇలా ముగ్గురు మంచు ఫ్యామిలీ హీరోల అభిమానులు కూడా కొన్నాళ్లుగా సాలిడ్‌ సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నారు.

ఇలాంటి సమయంలో కొడుకుల వల్ల దక్కని సక్సెస్‌ ను తాను తీసుకు వస్తానంటూ మంచు మోహన్‌ బాబు రెడీ అయ్యాడు.మంచు విష్ణు బ్యానర్ లో నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ ముగింపు దశకు వచ్చింది.

సినిమా త్వరలోనే విడుదల కాబోతుంది.ఈ సమయంలో మంచు వారు సన్నాఫ్‌ ఇండియా సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

సన్నాఫ్ ఇండియా సినిమా చిత్రీకరణ పూర్తి కావచ్చిన ఈ సమయంలో మోహన్ బాబు ఈ సినిమా నుండి ఒక పాటను విడుదల చేశారు.సన్నాఫ్ ఇండియా నుండి వస్తున్న పాట అంటే మరో లెవల్ లో ఊహించుకున్నారు.

ఖచ్చితంగా ఒక దేశ భక్త పాట అయ్యి ఉంటుందని ఇక రెండు మూడు వారాల పాటు సన్నాఫ్‌ ఇండియా పాట మారు మ్రోగడం ఖాయం అనుకున్నారు.కాని అంతా తలకిందులు అయ్యింది.

పాట కనీసం హమ్‌ చేసుకోవడానికి కూడా లేదు.దేశ భక్తి పాట అనుకుంటే మరీ దారుణంగా భక్తి పాటో లేదా మరేం పాటో కూడా అర్థం కాకుండా ఉంది అంటూ నెటిజన్స్ యూట్యూబ్‌ లో కామెంట్స్ చేస్తున్నారు.

పాటే ఇలా ఉంటే సినిమా మరే రేంజ్‌ లో ఉంటుందో అంటూ ఇప్పటి నుండే ప్రేక్షకులు భయపడుతున్నారు.మంచు మోహన్‌ బాబుకు గతంలో మంచి ట్యూన్స్ ఇచ్చిన ఇళయరాజా ఈ సినిమా కు ట్యూన్స్ అందించాడు.మరి ఈ పాట నిరాశ పర్చడంతో రాబోయే మిగిలిన పాటలు ఏంటో చూడాలి.

#Manoj Manchu #Song #Manchu Vishnu #Son Of India #Mohan Baabu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు