పాతికేళ్ల పెదరాయుడు.. పాత జ్ఞాపకాలు పంచుకున్న మోహన్ బాబు

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నటించిన బిగ్గెస్ట్ మూవీ ‘పెదరాయుడు’ అప్పట్లో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే.ఈ సినిమా పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కడంతో అప్పట్లో జనాలు ఈ సినిమాను చూసేందుకు థియేటర్లకు క్యూ కట్టారు.

 Mohan Babu Shares Video Of 25 Years Of Pedarayudu, Mohan Babu, Pedarayudu, Rajin-TeluguStop.com

బాక్సాఫీస్ కలెక్షన్లు అంతంతమాత్రంగా ఉన్న రోజుల్లోనే ఈ సినిమా కళ్లు చెదిరే వసూళ్లను సాధించింది.రవిరాజా పినిశెట్టి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో పెదరాయుడు పాత్రలో మోహన్ బాబు జీవించేశాడు.

ఇక ఈ సినిమా రిలీజ్ అయ్యి 25 ఏళ్లు పూర్తి చేసుకోవడంతో మోహన్ బాబు ఈ సినిమా ప్రారంభానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.ఈ వీడియోలో టాలీవుడ్‌కు చెందిన అతిరథ మహానుభావులు అందరూ హాజరయ్యారు.

ఎన్టీఆర్, ఏఎన్నార్, రజినీకాంత్, దాసరి నారాయణరావు లాంటి ప్రముఖులు ఈ వేడుకకు హాజరై మోహన్ బాబుకు శుభాకాంక్షలు తెలిపారు.ఇక ఈ సినిమాలో మోహన్ బాబు డ్యుయెల్ రోల్ చేయగా, ఇందులో సూపర్ స్టార్ రజినీకాంత్ ఓ కేమియో పాత్రలో నటించాడు.

భానుప్రియ, సౌందర్యలు హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు కోటి సంగీతం అందించగా, మోహన్ బాబు స్వయంగా ఈ సినిమాను ప్రొడ్యూస్ చేశారు.ఇక ఈ సినిమాతో మోహన్ బాబు తన కెరీర్‌లోనే బిగ్గె్స్ట్ హిట్ అందుకున్నాడు.

ఈ సినిమా కలెక్షన్ల పరంగా అప్పట్లో ఇండస్ట్రీ హిట్ మూవీగా నిలిచింది.ఈ సినిమా ప్రారంభోత్సవ వీడియోను మీరూ ఓసారి చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube