మోహన్ బాబు ఇండైరెక్ట్ సెటైర్స్.. వారి మీదనేనా!

Mohan Babu Satires On Mega Family

టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్స్ ఎసోసియేషన్ ఎన్నికలు హోరాహోరీగా జరిగిన విషయం తెలిసిందే.ఎప్పుడు టాలీవుడ్ లో మా ఎన్నికలకు ఇంత గొడవలు జరగలేదు.

 Mohan Babu Satires On Mega Family-TeluguStop.com

ఇప్పుడు మొదటి సారి ఇద్దరు సత్తా ఉన్న అభ్యర్థులు బరిలోకి దిగడంతో వాదనలు ప్రతివాదనలతో టాలీవుడ్ ను వార్తల్లో నిలబెట్టారు.అంత హీట్ పెంచేసిన మా ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ పై మంచు విష్ణు గెలిపొందారు.

వారం క్రితం జరిగిన ఎన్నికల్లో అధ్యక్ష పదవిని చేపట్టిన మంచు విష్ణు ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసారు.ఫిలిం నగర్ కల్చరర్ సెంటర్ లో ఈ ప్రమాణ స్వీకారం 11 గంటలకు జరిగింది.

 Mohan Babu Satires On Mega Family-మోహన్ బాబు ఇండైరెక్ట్ సెటైర్స్.. వారి మీదనేనా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మంచు విష్ణుతో పాటు తన ప్యానల్ లోని సభ్యులు కూడా ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు.ఈ కార్యక్రమానికి తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో పాటు సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు.

ఇక ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాల్గొన్న మోహన్ బాబు మీడియాతో మాట్లాడుతూ ఇన్ డైరెక్ట్ గా సెటైర్స్ వేశారు.

Telugu Maa, Manchu Vishnu, Mohan Babu, Tollywood Maa-Movie

మోహన్ బాబు మెగా ఫ్యామిలీతో పాటు ప్రకాష్ రాజ్ ప్యానల్ మీద కూడా ఇన్ డైరెక్ట్ గా పంచ్ లు వేసినట్టు తెలుస్తుంది.సినిమాలు హిట్, ప్లాప్ అవుతూనే ఉంటాయి.కానీ మేము అంత మంది ఉన్నాం.

ఇంత మంది ఉన్నాం అని బెదిరించిన బెదరకుండా ఓటు వేసి విష్ణును గెలిపంచిన మా సభ్యులందరికి ధన్యవాదాలు తెలిపారు.

Telugu Maa, Manchu Vishnu, Mohan Babu, Tollywood Maa-Movie

నాకు రాగ, ద్వేషాలు లేవు.ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతా.మంత్రి తలసాని శ్రీనివాస్ చెప్పినట్టు నా కోపం నాకు చెడు చేసింది అన్నారు.

ఇంకా విష్ణు ప్రామిస్ చేసిన అన్నిటిని నెరవేరుస్తాడని భావిస్తున్నాను.కలిసి మెలిసి ఉందాం.

కలిసి కట్టుగా సాధిద్దాం.దయచేసి నన్ను రెచ్చగొట్టకండి.

మనమందరం ఒక్కటే.ఎన్నికలను కృష్ణ మోహన్ ఎలాంటి వివాదాలకు తావు లేకుండా నిర్వహించారు.

ఇక దయచేసి మీడియాకు ఎక్కకండి.అంటూ మోహన్ బాబు మాట్లాడారు.

ఈ ఇన్ డైరెక్ట్ సెటైర్స్ అన్ని మెగా ఫ్యామిలీ పైనే అని అందరు అనుకుంటున్నారు.

#Maa #Mohan Babu #Mohan Babu #MAA #Manchu Vishnu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube