భార్యతో బీచ్ ఒడ్డున కలెక్షన్ కింగ్.. ఫోటో వైరల్..!- Mohan Babu Romantic Photo Viral On Social Media

mohan babu romantic photo viral on social media - Telugu Mohan Babu, Romantic Photo, Son Of India, Viral In Social Media

దాదాపు రెండు దశాబ్దాల క్రితం వరుస విజయాలతో కలెక్షన్ కింగ్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు మోహన్ బాబు.విష్ణు, మనోజ్ హీరోలుగా ఎంట్రీ ఇచ్చిన తరువాత పరిమితంగా సినిమాల్లో నటిస్తున్న మోహన్ బాబు తన పాత్రకు ప్రాధాన్యత ఉండే పాత్రలను ఎక్కువగా ఎంచుకుంటున్నారు.

 Mohan Babu Romantic Photo Viral On Social Media-TeluguStop.com

తాజాగా మోహన్ బాబు భార్య నిర్మలతో కలిసి బీచ్ ఒడ్డున ఫోటోకు ఫోజివ్వగా ఆ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది.
ఈ మధ్య కాలంలో చాలామంది సెలబ్రిటీలు వెకేషన్ కు మాల్దీవులకు వెళ్లగా తాజాగా మోహన్ బాబు కూడా ఆ జాబితాలో చేరారు.

మోహన్ బాబు, నిర్మలా దేవి దిగిన ఫోటోను మంచు లక్ష్మి సోషల్ మీడియాలో షేర్ చేశారు.చాలా సంవత్సరాల తర్వాత మోహన్ బాబు ఒక రొమాంటిక్ ఫోటోకు ఫోజులివ్వడంతో నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

 Mohan Babu Romantic Photo Viral On Social Media-భార్యతో బీచ్ ఒడ్డున కలెక్షన్ కింగ్.. ఫోటో వైరల్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

నెటిజన్లు మోహన్ బాబు గారు సిగ్గుపడటం తాము ఎప్పుడూ చూడలేదని కామెంట్లు చేస్తున్నారు.

మంచు లక్ష్మి, విద్యారణ్య కూడా బీచ్ లో సందడి చేశారు.మోహన్ బాబు అల్లుడు ఆండీ శ్రీనివాసన్ కూడా ఫోటోల్లో సందడి చేశారు.మరోవైపు మోహన్ బాబు ఆచార్య మూవీలో కీలక పాత్రలో నటిస్తున్నట్టు జోరుగా ప్రచారం జరగగా మోహన్ బాబు ఆ సినిమాలో నటించడం లేదని స్పష్టత వచ్చింది.

మరోవైపు మోహన్ బాబు ప్రస్తుతం సన్ ఆఫ్ ఇండియా సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.
డైమండ్ రత్నబాబు ఈ సినిమాకు డైరెక్టర్ గా వ్యవహరిస్తుండగా 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్లపై ఈ సినిమా తెరకెక్కుతోంది.

ఈ సినిమాకు విరానికా స్టైలిష్ట్ గా వ్యవహరిస్తుండగా ఇళయరాజా ఈ సినిమాకు సంగీతం వ్యవహరిస్తున్నారు.మోహన్ బాబు చాలా సంవత్సరాల తర్వాత నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి.

#ViralIn #Mohan Babu #Son Of India

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు