మంచు ల‌క్ష్మికి వైసీపీ టిక్కెట్‌..! రెండు ఆప్ష‌న్లు..!

టాలీవుడ్ క‌లెక్ష‌న్ కింగ్ మంచు మోహ‌న్‌బాబు కుమార్తె మంచు ల‌క్ష్మి రాజ‌కీయారంగ్రేటం చేయ‌నుందా ? ఆమె 2019 ఎన్నిక‌ల్లో చిత్తూరు జిల్లా నుంచి వైసీపీ టిక్కెట్టు కోసం ట్రై చేస్తుందా ? ఇందుకోసం ల‌క్ష్మి తండ్రి మోహ‌న్‌బాబు రంగంలోకి దిగారా ? అంటే అవున‌నే ఆన్స‌ర్లు విన‌వ‌స్తున్నాయి.గ‌తంలో టీడీపీ వ్య‌వ‌స్థాప‌కుడు, మాజీ ముఖ్య‌మంత్రి ఎన్టీఆర్‌కు చాలా స‌న్నిహితుడిగా ఉన్న మోహ‌న్‌బాబు ఆ పార్టీ నుంచి రాజ్య‌స‌భ‌కు ఎంపిక‌య్యారు.

 Mohan Babu Requesting For Mla Seat To Manchu Lakshmi-TeluguStop.com

త‌ర్వాత ప్ర‌స్తుత ఏపీ సీఎం చంద్ర‌బాబుతో విబేధాలు రావ‌డంతో మోహ‌న్‌బాబు కొద్ది రోజులుగా రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటున్నారు.

ఇక ఇప్పుడు ఏపీలో విప‌క్ష వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్‌బాబుకు మేన‌ల్లుడు వ‌రుస అవుతాడు.

జగన్ బాబాయి సుధీకర్ రెడ్డి కుమార్తె వెరోనికాను మోహన్ బాబు పెద్ద కుమారుడు పెళ్లి చేసుకున్న సంగ‌తి తెలిసిందే.దీంతో ఇప్పుడు త‌న అల్లుడు జ‌గ‌న్ పార్టీ వైసీపీ నుంచి త‌న కుమార్తె ల‌క్ష్మీప్ర‌స‌న్న‌ను ఎమ్మెల్యేగా పోటీ చేయించాల‌ని మోహ‌న్‌బాబు ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్న‌ట్టు తెలుస్తోంది.

మంచు ల‌క్ష్మి కోసం మోహ‌న్‌బాబు త‌మ సొంత జిల్లా చిత్తూరులోని సొంత నియోజ‌క‌వ‌ర్గం చంద్ర‌గిరి లేదా శ్రీకాళ‌హ‌స్తి నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎక్క‌డో ఓ చోట టిక్కెట్టు ఇవ్వాల‌ని కోరుతున్నార‌ట‌.చంద్ర‌గిరి నుంచి ప్ర‌స్తుతం వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్క‌ర‌రెడ్డి ఉన్నారు.

శ్రీకాళహస్తికి టీడీపీ నుంచి మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.అక్క‌డ గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ నుంచి పోటీచేసిన మ‌ధుసూద‌న్‌రెడ్డి గ‌ట్టి పోటీ ఇచ్చి ఓడిపోయారు.

మ‌ధుసూద‌న్‌రెడ్డి జ‌గ‌న్‌కు అత్యంత స‌న్నిహితుడు.ఈ నేప‌థ్యంలో అటు సిట్టింగ్ ఎమ్మెల్యేను, ఇటు స‌న్నిహితుడిని కాద‌ని జ‌గ‌న్ మంచు ల‌క్ష్మికి టిక్కెట్టు ఇస్తారా ? అన్న‌ది చూడాలి.మ‌రో వైపు మోహ‌న్‌బాబు స్వ‌యంగా రంగంలోకి దిగితే కాద‌న‌లేని ప‌రిస్థితి.మ‌రి మంచు ఫ్యామిలీ వైసీపీ ఎంట్రీ ఎలా ఉంటుంది ? ఆమెకు జ‌గ‌న్ ఎక్క‌డ టిక్కెట్టు ఇస్తాడన్న ప్ర‌శ్న‌ల‌కు కొద్ది రోజులు ఆగితే కాని క్లారిటీ రాదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube