పవన్ వ్యాఖ్యలకు రియాక్ట్ అయిన మోహన్ బాబు..!!

“రిపబ్లిక్” సినిమా ప్రీ రిలీజ్ వేడుకకి.ముఖ్య అతిథిగా వచ్చిన పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి తీవ్ర స్థాయిలో విమర్శలు చేయటం తెలిసిందే.

 Mohan Babu Reacts To Pawans Comments-TeluguStop.com

వైసీపీ ప్రభుత్వం అనవసరంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన విషయాలలో కలుగ చేసుకుంటుందని.టికెట్ బుకింగ్ ఆన్లైన్ విధానాన్ని తీసుకురావడాన్ని పవన్ తప్పుపట్టడం జరిగింది.

ఈ క్రమంలో వైసీపీ ప్రభుత్వానికి ఇండస్ట్రీలో దగ్గరగా ఉండే మోహన్ బాబు ఈ విషయంలో కలుగ చేసుకోవాలని .సూచించారు.లేకపోతే మోహన్ బాబు కి సంబంధించిన విద్యాసంస్థల విద్యార్థుల ఫీజులు కూడా.ఆన్ లైన్ విధానం ద్వారా కట్టించుకోవాలని వెటకారంగా పవన్ వ్యాఖ్యలు చేయడం జరిగింది.

 Mohan Babu Reacts To Pawans Comments-పవన్ వ్యాఖ్యలకు రియాక్ట్ అయిన మోహన్ బాబు..-Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ తరుణంలో పవన్ తనపై చేసిన కామెంట్లకు సోషల్ మీడియా వేదికగా మోహన్ బాబు రియాక్ట్ అయ్యారు.“నా చిరకాల మిత్రుడి సోదరుడైన పవన్ కళ్యాణ్.

నువ్వు నాకంటే చిన్నవాడివి అందుకే ఏకవచనంతో సంభోదించాను.పవన్ కళ్యాణ్ గారు అనడంలో కూడా తప్పేమీ లేదు.

చాలాకాలానికి నన్ను మెల్లగా లాగావ్.సంతోషమే.

ఇప్పుడు ‘మా’ ఎలక్షన్స్ జరుగుతున్నాయి.నా కుమారుడు విష్ణు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా నిలబడ్డాడు అన్న విషయం తెలిసిందే.

అక్టోబర్ 10వ తేదీన ఎలక్షన్స్ అయిపోతాయి.ఆ తర్వాత నువ్వు అడిగిన ప్రతి మాటకి నేను హృదయపూర్వకంగా సమాధానం చెబుతాను.

ఈలోగా నువ్వు చేయాల్సిన ముఖ్యమైన పని… నీ అమూల్యమైన ఓటుని నీ సోదరసమానుడైన విష్ణు బాబుకి.అతడి ఫ్యానల్‌కి వేసి వాళ్లని గెలిపించాలని కోరుకుంటున్నాను.

థాంక్యూ వెరీ మచ్” అని మోహన్ బాబు పేర్కొన్నారు.

#Pawan YCP #YS Jagan #MAA #Mohan Babu #MohanBabu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు