ఏంటీ మోహన్ బాబుకి మెసేజ్ పెట్టడం రాదా… మరి ఆ మెసేజ్ లు..   

Mohan Babu Message Writing Twitter Social Media - Telugu Chiranjeevi, Manchu Vishnu, Message Reply, Mohan Babu, Tollywood News, Twitter News

టాలీవుడ్ సినీ పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి మరియు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఇద్దరూ మంచి స్నేహితులు.అయితే వీరిద్దరి స్నేహబంధం ఎలా ఉంటుందో ఇప్పటికే వీరిద్దరూ బయట కలిసిన సందర్భాలను ఒకసారి పరిశీలించి చూస్తే మనకు బాగా అర్థమవుతుంది.

 Mohan Babu Message Writing Twitter Social Media

అయితే తాజాగా ఇటీవల కాలంలో మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా మాధ్యమం అయినటువంటి ట్విట్టర్లో ఖాతా తెరిచిన సంగతి అందరికీ తెలిసిందే.అయితే  ఇందుకుగాను టాలీవుడ్ ప్రముఖుల నుంచి భారీ ఎత్తున చిరంజీవికి ఘాన స్వాగతం లభించింది.

అయితే ఇందులో భాగంగా మోహన్ బాబు కూడా వెల్కం మిత్రమా అంటూ ట్విట్టర్ ప్రపంచానికి మెగాస్టార్ చిరంజీవిని ఆహ్వానించాడు.దీంతో చిరంజీవి కూడా తనదైన శైలిలో రిప్లై ఇచ్చాడు.

ఏంటీ మోహన్ బాబుకి మెసేజ్ పెట్టడం రాదా… మరి ఆ మెసేజ్ లు.. -Latest News-Telugu Tollywood Photo Image

తాజాగా వీరిద్దరి సంభాషణ నట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.అయితే ఈ విషయానికి సంబంధించినటువంటి ఓ విషయాన్ని మంచు మోహన్ బాబు పెద్దకొడుకు మంచు విష్ణు ప్రేక్షకులతో పంచుకున్నాడు.

ఇందులో భాగంగా తన తండ్రి మోహన్ బాబుకి మెసేజ్ చేయడం రాదని, కేవలం ఇతరులు పంపించినటువంటి మెసేజ్ చదువుతాడని, కానీ ఇతరుల నుంచి వచ్చిన మెసేజ్ కి నేనే రిప్లై ఇస్తుంటానని చెప్పుకొచ్చాడు.ఈ విషయం తెలుసుకున్నటువంటి మోహన్ బాబు అభిమానులు ఒక్కసారిగా ఖంగు తిన్నారు.

అంతేకాక మోహన్ బాబు ఒక మంచి నటుడిగానే కాకుండా తన పిల్లలతో కూడా చాలా సరదాగా ప్రవర్తిస్తుంటారని కామెంట్లు చేస్తున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం మంచు విష్ణు మోసగాళ్లు అనే చిత్రంలో నటిస్తున్నాడు.

ఈ చిత్రంలో విష్ణు సరసన టాలీవుడ్ గ్లామర్ క్వీన్ కాజల్ అగర్వాల్ నటిస్తోంది.అయితే ఈ చిత్రాన్ని జూన్ 5వ తారీఖున విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సభ్యులు యత్నాలు చేస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Is Really Mohan Babu Dont Know About Message Writing Related Telugu News,Photos/Pics,Images..