మోహన్‌బాబుకు సంవత్సరం జైలు శిక్ష... మరికొద్ది సేపట్లో అరెస్ట్‌కు రంగం సిద్దం  

Mohan Babu Going To Jail For One Year In Check Bouncing Case-mohan Babu Going To Jail For One Year,mohan Babu In Check Bouncing Case,telugu Viral News Updates,viral In Social Media

సినీ నటుడు మోహన్‌బాబు ఇటీవలే వైకాపాలో జాయిన్‌ అవ్వడం వల్ల మీడియాలో ప్రముఖంగా కనిపించిన విషయం తెల్సిందే. వైకాపాలో జాయిన్‌ అయిన తర్వాత ఆ పార్టీ తరపున ప్రచారం చేసేందుకు సిద్దం అవుతున్న మోహన్‌బాబుకు అనుకోని ఆపద వచ్చింది. 2010 నాటి చెక్‌ బౌన్స్‌ కేసులో ఇప్పుడు తుది తీర్పు వచ్చింది. వైవీఎస్‌ చౌదరికి మోహన్‌బాబు ఇచ్చిన చెక్‌ బౌన్స్‌ అవ్వడంతో ఆయన కేసు పెట్టాడు..

మోహన్‌బాబుకు సంవత్సరం జైలు శిక్ష... మరికొద్ది సేపట్లో అరెస్ట్‌కు రంగం సిద్దం-Mohan Babu Going To Jail For One Year In Check Bouncing Case

దాంతో కేసు విచారణ కోర్టుకు వెళ్లింది. కోర్టులో సుదీర్ఘ వాదనలు వినిపించారు. ఎట్టకేలకు వైవీఎస్‌ చౌదరికి న్యాయం జరిగింది.

వైవీఎస్‌ చౌదరి తరపున కేసు తీర్పు వచ్చింది. మోహన్‌బాబు చెక్‌ బౌన్స్‌ కేసులో సంవత్సరం పాటు జైలు శిక్ష అనుభవించబోతున్నాడు. దాంతో పాటు 45 లక్షల రూపాయలను సైతం చౌదరికి మోహన్‌బాబు ఇవ్వాలని కోర్టులో తీర్పు వచ్చింది. చెక్‌ బౌన్స్‌ కేసులో సంవత్సరం పాటు మోహన్‌బాబుకు జైలు శిక్ష పడ్డ నేపథ్యంలో పోలీసులు వెంటనే ఆయన్ను అరెస్ట్‌ చేసేందుకు సిద్దం అయ్యారు. చెక్‌ బౌన్స్‌ కేసులో మంచు లక్ష్మి కూడా ఉంది.

ఆమెకు ఎంత శిక్ష పడిందో తెలియాల్సి ఉంది..

మోహన్‌ బాబు ఏ2 కాగా, మంచు లక్ష్మి ఏ1 అంటూ ప్రచారం జరుగుతుంది. త్వరలోనే మోహన్‌ బాబును పోలీసులు అరెస్ట్‌ చేసి జైలుకు తరలించే అవకాశం ఉందని న్యాయ నిపుణులు అంటున్నారు. అయితే మోహన్‌బాబు ముందస్తు బెయిల్‌ తీసుకున్న తర్వాతే పోలీసులకు కనిపించే అవకాశం ఉందని, పోలీసులకు చిక్కకుండా ముందస్తు బెయిల్‌ కోసం మోహన్‌బాబు ప్రయత్నాలు చేస్తున్నాడు అంటూ సమాచారం అందుతోంది.

మొత్తానికి మోహన్‌బాబు వైకాపాలోకి వెళ్లిన వారం రోజులు కూడా తిరగకుండానే మరీ ఇంత పెద్ద సంఘటన జరుగుతుందని ఎవరు ఊహించి ఉండరు. ఈ విషయమై మంచు ఫ్యామిలీ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.