మోహన్ బాబుకి బెదిరింపు కాల్స్! వాస్తవాలపై విచారణ చేస్తున్న పోలీసులు  

Mohan Babu Complaint On Threatening Calls-

టాలీవుడ్ నటుడు మోహన్ బాబు తాజాగా వైసీపీ పార్టీలో చేరిన సంగతి అందరికి తెలిసిందే.ఇక వైసీపీలో చేరిన తర్వాత మోహన్ బాబు, చంద్రబాబుని టార్గెట్ గా చేసుకొని విమర్శలు చేస్తున్నారు.

Mohan Babu Complaint On Threatening Calls-

ఇక గతంలో జరిగిన అన్ని విషయాలని బయటకి తీసుకొచ్చి మీడియా ముందు చంద్రబాబు మోసాలని, కుట్రలని ఎత్తి చూపిస్తున్నారు.మరో వైపు మోహన్ బాబుని టార్గెట్ గా చేసుకొని టీడీపీ పార్టీ నేతలు కూడా విమర్శలు చేస్తున్నారు.

ఇదిలా ఉంటే వైసీపీ తరుపున మోహన్ బాబు ఎన్నికల ప్రచారం కూడా చేస్తున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా మోహన్ బాబు చంద్రబాబు మీద మరోసారి సంచలన వాఖ్యలు చేసారు.

హెరిటేజ్ సంస్థ తనదని బాబు లాక్కున్నాడని ఆరోపణలు చేసారు.ఇదిలా ఉంటే తాజాగా మరో సంచలన వాఖ్యలు కూడా చేసారు.

వైసీపీ పార్టీలో చేరినప్పటి నుంచి తనని చంపేస్తాం అంటూ బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయని.అజ్ఞాత వ్యక్తులు గత నెల 26న పలు నెంబర్ల నుండి ఫోన్‌ కాల్స్‌ వచ్చినట్టుగా తెలియజేస్తూ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో మోహన్ బాబు ఫిర్యాదు చేసారు.

ఇక ఈ బెదిరింపు కాల్స్ పై విచారణ చేసిన పోలీసులు అవి ఫారిన్ నుంచి వచ్చాయని తెలియజేసారు.అయితే ఆ కాల్స్ చేసిన వారి మీద ఎలా యాక్షన్ తీసుకోవాలి అనే విషయంపై న్యాయ సలహా తీసుకొని విచారణ జరుపుతామని స్పష్టం చేసారు.

తాజా వార్తలు

Mohan Babu Complaint On Threatening Calls- Related....