‘సిరివెన్నెల’ భౌతికకాయం చూడటానికి అందుకే వెళ్లలేదు.. మోహన్ బాబు కామెంట్స్ వైరల్!

Mohan Babu Comments About Sirivennela Seetaramashastry

ప్రముఖ పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణం ఆయన అభిమానులను, సినీ ప్రముఖులను ఎంతగానో బాధ పెట్టింది.సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన ఎన్నో పాటలు హిట్ అయ్యాయి.

 Mohan Babu Comments About Sirivennela Seetaramashastry-TeluguStop.com

సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణం సినిమా ఇండస్ట్రీకి తీరని లోటు అని చెప్పాలి.సిరివెన్నెల అంత్యక్రియలకు టాలీవుడ్ సినీ ప్రముఖులందరూ హాజరయ్యారు.

అయితే మోహన్ బాబు ఫ్యామిలీ హీరోలలో ఒక్కరు కూడా ‘సిరివెన్నెల’ భౌతికకాయం చూడటానికి హాజరు కాలేదు.

 Mohan Babu Comments About Sirivennela Seetaramashastry-‘సిరివెన్నెల’ భౌతికకాయం చూడటానికి అందుకే వెళ్లలేదు.. మోహన్ బాబు కామెంట్స్ వైరల్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మంచు ఫ్యామిలీ ఎందుకు రాలేదని చాలామందికి అనుమానాలు వ్యక్తమయ్యాయి.

అయితే తాజాగా ఒక కార్యక్రమానికి హాజరైన మోహన్ బాబు భౌతిక కాయం చూడటానికి హాజరు కాకపోవడానికి గల కారణాన్ని వెల్లడించారు.సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణంతో ఇండస్ట్రీ పెద్ద దిక్కుని కోల్పోయిందని మోహన్ బాబు అన్నారు.

అయితే మా ఇంట్లో కూడా తమ్ముడి మరణంతో  విషాద ఛాయలు అలుముకున్నాయని ఆయన వెల్లడించారు.

Telugu Ceremony, Manchu, Mohan Babu, Attended, Tollywood-Movie

సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణించిన సమయంలో మా ఇంటి నుంచి ఎవరూ బయటకు వెళ్లకూడదని అందుకే తన కుటుంబ సభ్యులకు ఎవరినీ వెళ్లొద్దని తాను చెప్పానని మోహన్ బాబు వెల్లడించారు.సిరివెన్నెల సీతారామశాస్త్రిని కొన్ని రోజులకు ఇండస్ట్రీ మరిచిపోతుందని అయితే ఆయన రాసిన పాటలను మాత్రం ముందు తరాల వాళ్లు కూడా వింటారని మోహన్ బాబు పేర్కొన్నారు.

Telugu Ceremony, Manchu, Mohan Babu, Attended, Tollywood-Movie

సిరివెన్నెల సీతారామశాస్త్రి ఆత్మకు శాంతి కలగాలని తాను మనస్పూర్తిగా కోరుకుంటున్నానని మోహన్ బాబు అన్నారు.గత కొన్నిరోజులుగా ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయని ఆ విషాదాలు తనను బాధ పెడుతున్నాయని మోహన్ బాబు పేర్కొన్నారు.మరోవైపు మోహన్ బాబు పరిమితంగా సినిమాలలో నటిస్తుండగా ఆయన నటించిన సన్నాఫ్ ఇండియా సినిమా త్వరలో రిలీజ్ కానుంది.

ఈ సినిమాతో మోహన్ బాబు హిట్ సాధిస్తారో లేదో చూడాల్సి ఉంది.మోహన్ బాబు తనకు పేరు తెచ్చిపెట్టే సినిమాలను మాత్రమే ఎంపిక చేసుకుంటున్నారు.

#Attended #Ceremony #Manchu #Mohan Babu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube