పుట్టినరోజు వేడకులను రద్దు చేసిన మోహన్ బాబు  

Mohan Babu Cancel Birthday Celebrations - Telugu Birthday Celebration, Mohan Babu, Sri Vidyanikethan, Telugu Movie News

టాలీవుడ్ కలెక్షన్ కింగ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుని దశాబ్దాలు గడుస్తుంది.కేవలం నటుడిగా మాత్రమే కాకుండా నిర్మాతగా, వ్యాపారవేత్తగా మోహన్ బాబు తనదైన మార్క్ వేసుకున్నాడు.

 Mohan Babu Cancel Birthday Celebrations

కాగా ప్రతి యేటా ఆయన పుట్టినరోజు వేడుకలను మార్చి 19న తిరుపతిలోని శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంటారు.

కాగా ఈ ఏడాది కూడా ఆయన పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించాలని నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు.

పుట్టినరోజు వేడకులను రద్దు చేసిన మోహన్ బాబు-Gossips-Telugu Tollywood Photo Image

అయితే ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ భయాందోళన ఏర్పడటంతో ఈ వేడుకలను రద్దు చేస్తున్నట్లు మోహన్ బాబు అధికారికంగా తెలిపారు.ప్రజలు కరోనా వైరస్ బారిన పడి ఇబ్బందులు పడుతుంటే ఆయన పుట్టినరోజు వేడుకలు ఎలా జరుపుకోవాలంటూ ప్రశ్నించారు.

అంతేగాక ఇలా వేడుకలు నిర్వహిస్తే సమూహం ఏర్పడుతుందని, అందుకే ఇలాంటి వేడుకలను నిర్వహించవద్దని, వాటికి అందరూ దూరంగా సురక్షితంగా ఉండాలంటూ అవగాహన కలిగించారు.

ఇలా కరోనా వైరస్ ప్రభావం గురించి అందరికీ అవగాహన కలిగించే విధంగా మోహన్ బాబు తీసుకున్న నిర్ణయం హర్షించ తగ్గ విషయం అని పలువురు అంటున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

footer-test