మళ్లీ బిజీ అవ్వబోతున్న మోహన్‌ బాబు  

Mohan Babu Busy With Movies In Again, Mohan Babu, Surya, Akasame Ne Haddura, Chiranjeevi, Mohan babu Busy With Movies - Telugu Akasame Ne Haddura, Chiranjeevi, Mohan Babu, Mohan Babu Busy With Movies, Surya

విలక్షణ నటుడు మోహన్‌ బాబు హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాల్లో నటించాడు.ఆయన చేసిన పలు సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద బిగ్గెస్ట్‌ సక్సెస్‌లను అందుకున్నాయి.

TeluguStop.com - Mohan Babu Busy With Movies In Again

చిరంజీవితో పాటు పలువురు స్టార్‌ హీరోలతో ఈయన సినిమాలు చేయడం జరిగింది.అయితే ఇప్పటికి ఆయన సినిమాలు చేసేందుకు ఆసక్తిగా ఉన్నా కూడా మేకర్స్‌ ఆయనతో వర్క్‌ చేసేందుకు సాహసించడం లేదు.

చిన్న విషయానికి కూడా చాలా పెద్ద క్లాస్‌ పీకడంతో పాటు అన్ని తాను అనుకున్నట్లుగా జరగాలనుకునే మోనార్క్‌.అందుకే ఆయనకు ఈమద్య కాలంలో సినిమాల్లో ఆఫర్లు రావడం లేదు.

TeluguStop.com - మళ్లీ బిజీ అవ్వబోతున్న మోహన్‌ బాబు-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

దాదాపు రెండు సంవత్సరాల క్రితం మోహన్‌బాబు ఒక సినిమాతో వచ్చాడు.అది కూడా పెద్దగా ఆడలేదు.

మొత్తంగా చూసుకుంటే గడచిన పదేళ్లుగా మోహన్‌బాబు చాలా పొడి పొడి సినిమాలు మాత్రమే చేశాడు.ఆయన అభిమానులు ఆయన నుండి చాలా ఆశిస్తున్నారు.

కాని ఆయన ఆఫర్లు రాకపోవడం వల్ల నిరాశ పర్చుతూ వచ్చాడు.అందుకే ఇకపై తన ఆఫర్లను తానే క్రియేట్‌ చేసుకోవాలనే నిర్ణయానికి మోహన్‌బాబు వచ్చినట్లుగా తెలుస్తోంది.

ఇటీవల తమిళంలో సూర్య నటించిన సూరారై పొట్రూలో నటించాడు.ఈ సినిమా తెలుగులో ఆకాశమే నీ హద్దురా అనే టైటిల్‌ తో రాబోతుంది.అందులో గెస్ట్‌ పాత్రలోనే కనిపించబోతున్న మోహన్‌ బాబు ఆ తర్వాత ఒక ఫుల్‌ లెంగ్త్‌ మూవీలో నటించేందుకు రెడీ అవుతున్నాడు.అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి.

మలయాళంలో గత సంవత్సరం విడుదల అయ్యి విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న ఒక సినిమాను మోహన్‌ బాబు రీమేక్‌ చేసేందుకు రెడీ అవుతున్నాడు.ఆ సినిమాలో మోహన్‌ బాబు లీడ్‌ రోల్‌ లో కనిపించబోతున్నాడట.

వయసుకు తగ్గ పాత్రలో మోహన్‌బాబు నటించేందుకు రెడీ అవుతున్నాడు.ఈ రీమేక్‌ కు సంబంధించి అతి త్వరలోనే పూర్తి క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.

ఈ రీమేక్‌ మాత్రమే కాకుండా ఇకపై వరుసగా ఏడాదిలో కనీసం మూడు నాలుగు సినిమాల్లో అయినా నటించాలని మోహన్‌బాబు భావిస్తున్నాడట.ఆయన ఆలోచన అభిమానులకు సంతోషాన్ని కలిగిస్తుంది.

#MohanBabu #Chiranjeevi #Surya #Mohan Babu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Mohan Babu Busy With Movies In Again Related Telugu News,Photos/Pics,Images..