మోహన్ బాబు బిగ్ అనౌన్స్ మెంట్.. తన కల నెరవేరిందంటూ..

Mohan Babu Announces Mbu University In Tirupathi

తెలుగు సీనియర్ హీరోల్లో మంచు మోహన్ బాబు ఒకరు.ఈయన గురించి తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు .

 Mohan Babu Announces Mbu University In Tirupathi-TeluguStop.com

ఈయన తన సినిమాలతో తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.మొదట్లో మోహన్ బాబు విలన్ గా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు.

ఆ తర్వాత ఆయన హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.ఈయన యాక్షన్, సెంటిమెంట్, కామెడీ జోనర్స్ లో సినిమాలు చేసాడు.

 Mohan Babu Announces Mbu University In Tirupathi-మోహన్ బాబు బిగ్ అనౌన్స్ మెంట్.. తన కల నెరవేరిందంటూ..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కొన్ని సినిమాలు మోహన్ బాబుకు మంచి పేరు తెచ్చిపెట్టడమే కాదు ఆయనను విలక్షణ నటుడు అనే బిరుదును కూడా అందించాయి.మోహన్ బాబు చాలా హిట్ సినిమాల్లో నటించాడు.

మోహన్ బాబు మూడు దశాబ్దాలుగా చిత్ర పరిశ్రమలో సినీ రంగంలో ఉన్నారు.ఆయన కేరీర్ లో చాలా విభిన్నమైన పాత్రలు చేసాడు.

సినిమాలు మాత్రమే కాదు ఈయన రాజకీయాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు.

రాజకీయాల్లో కూడా తనదైన ముద్రను వేసుకున్నాడు.

ఇక ఆ తర్వాత మోహన్ బాబు విద్యారంగం లోకి కూడా అడుగు పెట్టాడు.

తిరుపతిలో ప్రసిద్ధ శ్రీ విద్యానికేతన అనే విద్యా సంస్థను ప్రారంభించాడు.ఇప్పుడు మరొక అడుగు ముందుకు వేసాడు మోహన్ బాబు.ఈయన ఈ రోజు కీలక ప్రకటన చేసాడు.ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక ప్రకటన చేసాడు.

”శ్రీ విద్యానికేతన్ వేసిన విత్తనాలు ఇప్పుడు కల్ప వృక్షంగా మారాయి.మీ 30 సంవత్సరాల విసావాసం, నా జీవిత లక్ష్యం ఇప్పుడు వినూత్న విశ్వం లోకి చేరుకుంది.కృతజ్ఞతతో తిరుపతిలో మోహన్ బాబు యూనివర్సిటీని మీకు అందిస్తున్నాను.

మీ ప్రేమే నా బలం, మీరు కూడా ఈ మద్దతు ఇస్తారని ఆశిస్తున్నాను” అంటూ మోహన్ బాబు తన జీవిత కల గురించి అతడి కల నెరవేరడం గురించి చెప్పుకొచ్చాడు.

#MohanBabu #Mohan Babu #Tirupati #Mohan Babu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube