మోహన్ బాబుతో మరోసారి జత కట్టిన మీనా

విలక్షన్ నటుడుగా టాలీవుడ్ లో సుదీర్ఘ కాలం నట ప్రస్తానం కొనసాగిస్తున్న టాలెంటెడ్ యాక్టర్ కలెక్షన్స్ కింగ్ మోహన్ బాబు.కెరియర్ ఆరంభంలో విలన్ గా తన వేరియేషన్స్ తో అందరిని అలరించిన మోహన్ బాబు తరువాత హీరోగా వరుస విజయాలు అందుకొని తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు.ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేస్తున్నాడు.ప్రస్తుతం మోహన్ బాబు టైటిల్ రోల్ లో సన్నాఫ్ ఇండియా అనే సినిమా తెరకెక్కుతుంది.రైటర్ నుంచి దర్శకుడుగా మారిన డిమాండ్ రత్నబాబు ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.దేశభక్తి కథాంశంతో ఈ సినిమా రూపొందుతుంది.

 Mohan Babu And Meena Combination Repeat Again-TeluguStop.com

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుంది.హైదరాబాద్ పరిసరాలలో ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది.

చాలా గ్యాప్ తర్వాత పవర్ ఫుల్ పాత్రలో మోహన్ బాబు ఈ సినిమాలో కనిపించబోతున్నాడు.

 Mohan Babu And Meena Combination Repeat Again-మోహన్ బాబుతో మరోసారి జత కట్టిన మీనా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇదిలా ఉంటే ఈ సినిమాలో మోహన్ బాబుకి జోడీగా సీనియర్ హీరోయిన్ మీనాని ఫైనల్ చేశారు.దృశ్యం2 సినిమాతో మీనా తాజాగా సూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది.ఈమె ప్రస్తుతం ఓ వైపు నటిగా సాగుతూనే మరో వైపు రియాలిటీ షోలకి జడ్జ్ గా వస్తుంది.

మోహన్ బాబు, మీనా కాంబినేషన్ లో ఇప్పటి వరకు మూడు సినిమాలు వచ్చాయి.అందులో అల్లరి అల్లుడు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడమే కాకుండా మోహన్ బాబు కెరియర్ లో చిరస్మరణీయంగా నిలిచిపోయే చిత్రంగా ఉండిపోయింది.

వీరిద్దరు చివరిగా మామ మంచు అల్లుడు కంచు సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు.ఈ సినిమా అనుకున్న స్థాయిలో హిట్ కాలేదు.అయితే మళ్ళీ ఇప్పుడు సన్నాఫ్ ఇండియా మూవీ కోసం మోహన్ బాబు, మీనా జత కడుతున్నారు.మోహన్ బాబుకు భార్య పాత్రలో నటించనుంది.

ఆమె క్యారెక్టర్ అద్భుతంగా డిజైన్ చేసినట్లు టాక్.

#Meena #Mohan Babu #DiamondRathna

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు