Mohan babu chiranjeevi : మెగాస్టార్ చిరంజీవికి అరుదైన గౌరవం.. ప్రశంసల వర్షం కురిపించిన మంచు ఫ్యామిలీ?

తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

మెగాస్టార్ చిరంజీవికి తెలుగు సినీ ఇండస్ట్రీలో ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ముందు మనందరికీ తెలిసిందే.

తెలుగు సినీ ఇండస్ట్రీలో అగ్ర హీరోగా తన కంటే ఒక ప్రత్యేకమైన మార్క్ ని క్రియేట్ చేసుకున్నారు.ఇప్పటికీ అదే ఊపుతో సినిమాలలో నటిస్తూ వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు.

ఆ తరం ప్రేక్షకులకు ఈ తరం ప్రేక్షకులకు మెగాస్టార్ చిరంజీవి సుపరిచితమే.అంతేకాకుండా ఎంతో మంది అప్ కమింగ్ హీరోలకు మెగాస్టార్ చిరంజీవి ఒక ఇన్స్పిరేషన్ అని చెప్పవచ్చు.

ఇది ఇలా ఉంటే తాజాగా మెగాస్టార్ చిరంజీవి కి ఒక అరుదైన గౌరవం దక్కింది.ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా కార్యక్రమంలో చిరంజీవికి ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ఇండియా అనే అవార్డును ప్రకటించారు.

Advertisement

అయితే ఇప్పటికే ఈ అవార్డు ను వరకు రజినీకాంత్, అమితాబ్ బచ్చన్, ఇళయరాజా, ఎస్పీబీ వంటి వారికి ప్రకటించిన విషయం తెలిసిందే.ఈ ఏడాది మెగాస్టార్ చిరంజీవిని కేంద్ర ప్రభుత్వం సత్కరించనుంది.

మెగాస్టార్ చిరంజీవి ఈ ఘనతను సాధించడంతో తెలుగు సినిమా ఇండస్ట్రీ ఆనందం వ్యక్తం చేస్తోంది.ఇప్పటికే టాలీవుడ్లో పలువురు సంతోషం వ్యక్తం చేస్తూ మెగాస్టార్ చిరంజీవికి శుభాకాంక్షలను తెలుపుతున్నారు.

ఈ క్రమంలోనే తాజాగా మంచు ఫ్యామిలీ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ మెగాస్టార్ చిరంజీవి అభినందించారు.ఈ సందర్భంగా మోహన్ బాబు ట్వీట్ చేస్తూ.నా ప్రియమైన చిరంజీవిని గోవాలో జరిగే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఈవెంట్‌లో ఇలాంటి సత్కారం లభించబోతోన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది.కంగ్రాట్స్.

ఆ షిర్డీ సాయి బాబా ఆశీస్సులు ఆయనకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుతున్నాను అంటూ సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు.అలాగే మంచి విష్ణు కూడా స్పందిస్తూ.

రాజమౌళి వల్లే టాలీవుడ్ హీరోలకు ఈ స్థాయిలో గుర్తింపు.. నమ్మకపోయినా నిజమిదేనా?
రైతు పండుగ :నేడు రేవంత్ చెప్పనున్న ఆ రెండు శుభవార్తలు ఏంటి ? 

చిరంజీవి గారికి ఇలాంటి గౌరవం లభిస్తున్నందుకు చిరంజీవి గారికి కంగ్రాట్స్.ఇది మన తెలుగు చిత్ర సీమకు ఎంతో గర్వకారణం అంటూ మంచు విష్ణు ట్వీట్ చేసారు.

Advertisement

తాజా వార్తలు