అక్బరుద్దీన్ పై దాడి చేసిన పైల్వాన్ గుండె పోటు తో మృతి

ఎంఐఎం ప్రముఖ నేత అక్బరుద్దీన్ ఓవైసీపై 2011 న దాడికి పాల్పడిన చాంద్రాయణగుట్ట నివాసి మహ్మద్ పైల్వాన్ ఈ రోజు గుండె పోటు తో మృతి చెందినట్లు తెలుస్తుంది.8 సంవత్సరాల క్రితం అక్బరుద్దీన్ పై దాడి చేసిన కేసులో కేసులో అరెస్ట్ అయిన పైల్వాన్ బెయిల్ పై బయటే ఉన్నారు.అయితే ఆయన యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నేడు గుండెపోటుతో మరణించినట్లు సమాచారం.8 సంవత్సరాల క్రితం అక్బర్‌పై పైల్వాన్ ఆధ్వర్యంలోనే దాడి జరిగింది.ఏప్రిల్ 30వ తేదీ 2011లో అక్బర్ పై ప్రత్యర్థులు దాడికి పాల్పడ్డారు.ఈ ఘటనలో అక్బర్ శరీరలోకి 3 బుల్లెట్లు, 5 …కత్తి పోట్లు దిగాయి.

 Mohammad Pailwan Who Attacked On Akbaruddin Owaisi Dead-TeluguStop.com

ఈ దాడిలో తీవ్ర గాయాలపాలైన అక్బరుద్దీన్‌ను హుటాహుటిన కేర్ ఆస్పత్రికి తరలించారు.అయితే ఆయన శరీరంలో దిగిన మూడు బుల్లెట్ లలో కేవలం రెండిటిని మాత్రమే వైద్యులు తొలగించగలిగారు.

దీనితో ఇప్పటికీ కూడా అక్బరుద్దీన్ శరీరంలో ఒక బుల్లెట్ అలానే ఉండిపోయింది.ఈ ఘటన తర్వాత అక్బరుద్దీన్ ఆరోగ్యం అనేక సార్లు క్షీణించింది.

దీంతో ఆయన చికిత్స నిమిత్తం అప్పుడప్పుడు లండన్‌ కూడా వెళ్తుంటారు.అయితే ఈ కేసుకు సంబంధించి పైల్వాన్ ను అరెస్ట్ చేయగా, ఆ తరువాత ఆయన బెయిల్ పై బయటే ఉంటున్నారు.

ఈ క్రమంలోనే ఆయన గుండె పోటు తో మృతి చెందినట్లు తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube