'రెడ్డి రాజ్యం' అంటున్న టీడీపీ ఎమ్యెల్యే ! వైసీపీలోకి జంప్ చేయడం ఖాయమేనా ..?  

Modugula Venugopala Reddy Wants To Join In Ycp-elections In Ap,modugula Venugopala Reddy,tdp,tdp Mla Wants Join In Ycp,ycp,ys Jagan,ysrcp

It looks like an Emilee looks in TDP. The senior political leader in the TDP is the background of the political situation that prevails today ... YSR Congress is preparing to join Congress party in the wake of its social pressure. Modiji's Venugopal Reddy who is currently the West MLA of Guntur .. At the time of his communal rituals ... In the upcoming elections the Reds should be the nation .. win the manadi in the jurisdiction .. Tidipi no matter how badly my situation is tadipi shock . On the one hand, Yeddyurappa's Congress Party is sure to put the tactics of the TDP to the uncomfortable level.

.

TDP is suspected of being a big story behind such statements. TDP has come up with a view to join him as a vice-chancellor. He has been in touch with Jagan since his predecessors. In the background of coming to the polls now, he was informed that he would not have any pretense of political career if he entered the NCP. It is interesting to know where he will contest from the seat. Whether it will contest from Narasarau Peta, or from the seat of the MLA, is not yet a clarity. YSR Congress is in the party. . .

..

..

..

టీడీపీలో ఓ ఎమ్యెల్యే పక్కచూపులు చూస్తున్నట్టుగా కనిపిస్తోంది. టీడీపీలో సీనియర్ నాయకుడిగా ఉన్న సదరు ఎమ్యెల్యే ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపధ్యం…తన సామాజిక వర్గం ఒత్తిళ్ల నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధం అయినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. టీడీపీలో ఎంపీగా పనిచేసి …ప్రస్తుతం గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యేగా ఉన్న మోదుగుల వేణుగోపాల్ రెడ్డి .ఇటీవల తన సామజిక వర్గ వనభోజనాల సందర్భంగా… రాబోయే ఎన్నికల్లో రెడ్ల రాజ్యం కావాలి. గురజాలలో మనోడినే గెలిపించుకోండి. టీడీపీలో నా పరిస్థితి ఏమాత్రం బాగోలేదంటూ సంచలన వ్యాఖ్యలు చేయడం టీడీపీని ఒక్కసారిగా షాక్ కి గురిచేశాయి...

'రెడ్డి రాజ్యం' అంటున్న టీడీపీ ఎమ్యెల్యే ! వైసీపీలోకి జంప్ చేయడం ఖాయమేనా ..?-Modugula Venugopala Reddy Wants To Join In YCP

ఒకపక్క వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మీద అలుపెరగని స్థాయిలో పోరాడుతున్న టీడీపీకి మోదుగుల వ్యాఖ్యలు ఖచ్చితంగా చేటు చేయడం ఖాయం.

అసలు మోదుగుల ఇటువంటి వ్యాఖ్యలు చేయడం వెనుక పెద్ద కధే ఉన్నట్టు టీడీపీ అనుమానిస్తోంది. అయన వైసీపీలో చేరడం ఖాయమే అన్న ఒక అభిప్రాయానికి టీడీపీ వచ్చేసింది. ఆయన ముందు నుంచి జగన్ తో కాస్త టచ్లోనే ఉన్నాడు మోదుగుల.

ఇప్పడు ఎన్నికల సమయం దగ్గరకు వస్తున్న నేపథ్యంలో వైసీపీలోకి వెళ్తే తన రాజకీయ జీవితానికి ఎటువంటి డోఖా ఉండదు అనే ఆలోచనలో ఆయన ఉన్నట్టు సమాచారం. మరి మోదుగుల వైసీపీలోకి చేరితే ఎక్కడ నుంచి పోటీ చేస్తాడనేది ఆసక్తిదాయకమైన అంశం. నరసరావు పేట నుంచి ఎంపీగా పోటీ చేస్తాడా, లేక మరోసీటు నుంచి ఎమ్మెల్యేగానే రంగంలోకి దిగుతాడా అనేది ఇంకా క్లారిటీ అయితే రాలేదు..

అసలు ఇప్పటికే… మోదుగుల బంధువర్గం అంతా కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంది.

వాస్తవానికి మోదుగులకు చాలా కాలంగా టీడీపీ అధినేత చంద్రబాబుతో ఆంటీ ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నాడు. పార్టీ విధానాలపైన, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలపైన బాహాటంగానే మోదుగుల తన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు తాను చెప్పిన పని చెయ్యకపోతే అధికారులను కూడా బహిరంగంగానే విమర్శిస్తున్నారు. దీంతో మోదుగుల వైఖరిపై ఇటు పార్టీలోను అటు ప్రభుత్వంలోను చర్చ జరుగుతోంది.

వాస్తవంగా…అధికారంలోకి వస్తే మంత్రి వర్గంలోకి తీసుకుంటానని చంద్రబాబు హామీ ఇచ్చారని అందువల్లే తాను ఎమ్మెల్యేగా పోటీ చేసినట్లు మోదుగుల తన సన్నిహితుల వద్ద చెప్పుకునేవారు. టీడీపీ అధికారంలోకి రావడం, మోదుగుల ఎమ్మెల్యేగా గెలవడం జరిగిపోయింది కానీ మంత్రి మాత్రం కాలేకపోయారు. దీంతో…మోదుగులను సీఎం చంద్రబాబు పక్కనపెట్టేశారంటూ రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇక ఇప్పుడు బహిరంగంగానే వైసీపీ అభ్యర్థికి మద్దతు ప్రకటించడం ద్వారా తాను వైసీపీలో చేరబోతున్నాను అనే సంకేతాలను ఆయన ఇచ్చాడనే వార్తలు వినిపిస్తున్నాయి.