కేసీఆర్ ని భయపెడుతున్న మోదీ పొగడ్తలు .     2018-07-23   12:25:45  IST  Sai Mallula

తెలంగాణ సీఎం కేసీఆర్ కి ఇప్పుడు ఓ కొత్త చిక్కొచ్చిపడింది. పార్లమెంటులో టీడీపీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ సీఎం కేసీఆర్ ని పొగడ్తల వర్షంలో ముంచేశాడు. కేసీఆర్ చిత్తశుద్ధిగల నాయకుడని, అతన్ని చూసి చాలా నేర్చుకోవాలి అంటూ చంద్రబాబు ని టార్గెట్ చేస్తూ మాట్లాడేసాడు. అయితే అదే ఇప్పుడు కేసీఆర్ కి పెద్ద తలనొప్పిగా మారింది. ఈ ప్రశంసల కారణంగానే..ఇప్పుడు అనేక విమర్శలు చెలరేగుతున్నాయి. బీజేపీ టీఆర్ఎస్ మధ్య ఏదో ఒప్పందం ఉంది అందుకే.. బీజేపీకే మద్దతిచ్చిందని భావిస్తున్నారు. ఇది తెలంగాణ రాష్ట్ర సమితి అధినేతకు రెండు విధాలుగా టెన్షన్ పెడుతోంది.

Modi's Praise For K Chandrashekhar Rao-

Modi's Praise For K Chandrashekhar Rao

బీజేపీతో ప్రశంసలు పొందడానికి రాష్ట్ర ప్రయోజనాలపై రాజీ పడ్డారనే ప్రచారం.. ఇతర వర్గాల్లో సాగుతోంది. ముఖ్యంగా.. ఉద్యమకారుల్లో ఈ అభిప్రాయం పెరిగిపోతోంది. ఏపీలో ప్రభుత్వం కొట్లాడుతూ కూడా.. ఎంతో కొంత నిధులు తెచ్చుకుంటూ ఉంటే.. తెలంగాణకు ఒక్క రూపాయి ఇవ్వకపోయినా..కేసీఆర్ నోరు మెదపడం లేదన్న భావన పెరిగిపోతోంది. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ కేంద్రం ఇవ్వకపోతే..మేమే కట్టుకుంటాం. అన్న కేసీఆర్ వ్యాఖ్యలపై అసహనం వ్యక్తమవుతోంది.

టీజేఎస్ అధినేత కోదండరాం.. దీన్నే హైలెట్ చేసి చాపకింద నీరులా ప్రచారం చేస్తున్నారు. ఇది ఒక్కటే.. ఈ నాలుగేళ్ల కాలంలో.. కేంద్రం నుంచి విభజన చట్టం ప్రకారం కానీ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ, ప్రాజెక్టుల రీ డిజైన్ కు కానీ కేంద్రం ఒక్క రూపాయి విదిలించలేదు. వీటికి నిధులివ్వాలని నీతి ఆయోగ్ సిఫార్సు చేసినా పట్టించుకోలేదు. ఏపీ నిధులు అడుగుతోంది.. తెలంగాణ అడగడం లేదు కాబట్టే. కేసీఆర్‌ను మోడీ పొగిడినట్లుగా.. ప్రజల్లోకి వెళ్తోంది. ఇది అర్థమైన కేసీఆర్ నిన్న గవర్నర్‌ను కలిశారు. సాయం చేయాల్సిందేనన్న డిమాండ్ లాంటి విజ్ఞప్తిని కేంద్రానికి గవర్నర్ ద్వారా చక్కబెట్టే ప్రయత్నం చేస్తున్నారు.