కాంగ్రెస్ చేతికి మోడీ జుట్టు...బలే దొరికాడు మోడీ     2018-11-08   13:14:36  IST  Surya Krishna

భారత ప్రధాని మోడీ ఎప్పుడు ఏ విషయంలో, ఎప్పుడు ఎలా దొరుకుతారా అని వేచి చూస్తున్న కాంగ్రెస్ పార్టీకి మోడీ జుట్టు దొరికేసింది..తమకంటూ మోడీ ని ఎదుర్కోవడానికి ఎంతో బలమైన ఆయుధం కావాలని వేచి చూస్తున్న కాంగ్రెస్ పార్టీకి అసలు సిసలు అస్త్రం దొరికింది. ఎత్తి పరిస్థితుల్లో ఈ విషయంపై పోరాటం చేయాల్సిందేనని కాంగ్రెస్ పార్టీ ఫిక్స్ అయ్యిపోయిందట. అయితే పోరాటం చేస్తాం తరువాత పరిణామాలు కాంగ్రెస్ పార్టీ పై ప్రభావం పడకుండా ఉండేలా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలోనని ఆలోచనలో ఉందని తెలుస్తోంది…

Modi's Hair In Congress Hand-

Modi's Hair In Congress Hand

అసలు ఇంతకీ మోడీ జుట్టు ఎలా దొరికింది..కాంగ్రెస్ ఈ విషయంలో ఎందుకు జాగ్రత్తలు తీసుకోవాలి..?? ఎదో అరవ సినిమా చూస్తున్నట్టుగా ఉందా…సరే అసలు విషయం ఏమిటంటే..భారతదేశ ప్రధానిగా మోడీ ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఎన్నడూ లేని సంస్కరణలు ఎన్నో వ్యూహాలు మోడీ తన సన్నిహితుడు షా తో కలిసి రచిస్తూనే ఆ సంస్కరణలు..మార్పులు చేర్పులు బీజేపీకి భవిష్యత్తు ఎన్నికల్లో ఉపయోగ పడేలా వ్యూహరచన చేస్తున్నారు..

అయితే ఈ క్రమంలోనే మోడీ గుజరాత్ లో నర్మదా నదీ తీరంలో ఏర్పాటు చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ కాంస్య విగ్రహం ఏర్పాటు అత్యంత భారీగా జరిపించారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన విగ్రహంగా పేర్కొన్నారు..ఇక్కడి వరకూ బాగానే ఉంది.గుజరాత్ లో పటేళ్ళ మనసు దోచుకోవడంలో కూడా సక్సెస్ అయ్యాడు..ఎంతో మంది ఎన్నో విమర్శలు చేస్తున్నా సరే ఈ విగ్రహం ఏర్పాటులో మోడీ నిగ్రహాన్ని కోల్పోలేదు.మొత్తానికి నిర్మాణం పూర్తి చేశాడు. అయితే ఇక్కడే మోడీ గొంతులో పచ్చి వెలక్కాయి పడేసింది బ్రిటన్.

Modi's Hair In Congress Hand-

మీరు ఒక విగ్రహాన్ని కట్టడం కోసం అన్ని వేల కోట్లు ఖర్చు పెట్టాలా.. 2012 నుంచీ ఇప్పటి వరకూ దాదాపు రూ. 11వేల కోట్లు సాయంగా అందిస్తే.. అందులో దాదాపు రూ 3 వేల కోట్లు ఈ విగ్రహానికే ఖర్చు చేశారు ఇదేమి పద్దతి అంటూ బ్రిటన్‌ అధికారపక్ష ఎంపీ పీటర్‌ బోన్‌ విమర్శించారు.. తాము ఐదేళ్ళలో భారత్‌కు పలు ప్రత్యేక ప్రాజెక్టుల కోసం నిధులను ఇచ్చామని, మహిళల హక్కులకు సంబంధించి,పునరుత్పాదక ఇంధన రంగంలోని ప్రాజెక్టులు అందించామని అన్నారు మీరు విగ్రహాల కోసం అంత ఖర్చులు పెడితే ఇక మా సాయం భారత్ కి అవసరం లేదని మాకు అర్థం అయ్యింది అంటూ ఘాటు విమర్శలు చేశారు దాంతో ఒక్క సారిగా కేంద్రంలో రాజకీయ పరిణామాలు మారిపోయాయి..

మోడీ ని సరైన సమయంలో దెబ్బకొట్టాలని చూస్తున్న కాంగ్రెస్ పార్టీకి మంచి అవకాశం దొరికినట్టయ్యంది.మరి ప్రజల నుంచీ వసూలు చేసిన కోట్లాది రూపాయలు ఏమయ్యాయి అంటూ కౌంటర్ మోడీ ని ఇబ్బంది పెట్టె ప్రయత్నాలు మొదలయ్యాయి అయితే గుజరాత్ లో పటేళ్ళ మనోభావాలు దెబ్బతినకుండా ఉండేలా మోడీ నిర్మించిన స్టాట్యూ ఆఫ్ యూనిటీ పై పోరు చేయాలని ఫిక్స్ అయ్యారని తెలుస్తోంది.మొత్తానికి తానూ ఎదో సాధించానని సంబర పడుతున్న మోడీ కి ఎనికల ముందు బ్రిటన్ చావు దెబ్బ కొట్టినట్టు అయ్యిందని అంటున్నారు విశ్లేషకులు.